హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డు..! హ‌రీష్ రావు కు ద‌క్క‌ని క్రెడిబులిటీ...!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో సాగు, త్రాగు నీటి శాశ్వ‌త వ‌న‌రైన చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ఎంత‌గానో అంకిత భావాన్ని ప్ర‌ద‌ర్శిచింది. అందులో భాగంగా స‌మూల మార్పుల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తూనే వినూత్న ప‌థ‌కాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టింది. మిషన్ భ‌గీర‌థ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెరువులు అంత‌రించి పోకుండా కాపాడుకునే కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. అందుకు మాజీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీశం రావు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించి ప‌థ‌కం విజ‌య‌వంతం కావ‌డంలో కీలక పాత్ర పోషింంచారు. కాని ప‌థ‌కాలు దేశ‌వ్యాప్తంగా గుర్తింపుపొంది, అవార్డులు, రివార్టులు సొంతం చేసుకుంటున్న స‌మ‌యంలో మాత్రం ఆయ‌న ప్ర‌స్థావ‌న ఎక్క‌డా రాక‌పోవ‌డం విచార‌కం..!!

మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డులు..! ప‌థ‌కం విజ‌య‌వంత చేసిన హ‌రీష్ ప్ర‌స్థావ‌న ఎక్క‌డా లేదు..!

మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డులు..! ప‌థ‌కం విజ‌య‌వంత చేసిన హ‌రీష్ ప్ర‌స్థావ‌న ఎక్క‌డా లేదు..!

తెలంగాణ రాష్ట్రం సిద్దించిన త‌ర్వాత సాగు, త్రాగు నీటి ప్రాజెక్టుల అభివ్రుద్ది కోసం అనేక నూత‌న మార్గాల‌ను అన్వేషించింది ప్ర‌భుత్వం. అందులో భాగంగా స్థానిక‌గా ఉన్న చెరువుల సంర‌క్ష‌ణ‌. ప్ర‌క్ష‌ళ‌న వంటి ్ంటి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. మిష‌న్ భ‌గీర‌థ పేరుతో చేప‌ట్టిన ఈ వినూత్న ప‌థ‌కానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింది. అంతే తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు అందించింది.

తెలంగాణ‌లో సాగు, త్రాగునీటి స‌మ‌స్య‌కు చెక్..! అందుకే మిష‌న్ భ‌గీర‌థ‌..!!

తెలంగాణ‌లో సాగు, త్రాగునీటి స‌మ‌స్య‌కు చెక్..! అందుకే మిష‌న్ భ‌గీర‌థ‌..!!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వార్షికోత్సవం సందర్భంగా నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు అందించడంలో ముఖ్య వనరుగా వున్నచెరువులను పునరుద్దరించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది.

ప‌థ‌కం స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు..! హ‌రీష్ అంకిత భావం..!

ప‌థ‌కం స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు..! హ‌రీష్ అంకిత భావం..!

ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత అది వేగ‌వంతంగా అమ‌ల‌వ్వ‌డంతో త్వ‌రగా పూర్తి చేయ‌డంలో మాజీ భారీనీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు క్రుషి ఎంత‌గానో ఉంది. కాని అవార్డుల సంద‌ర్బంగా హ‌రీష్ పేరు ఎక్క‌డా క‌నిపించ‌క పోవ‌డం ఆవేద‌న క‌లిగిస్తున్న అంశంగా హ‌రీష్ రావు అభిమానులు అంటున్నారు. అన్నదాతల కోసం జరుగుతున్న ఈ బృహత్తర పథకం ఇప్పటికే అనేక అవార్డులను కైవసం చేసుకోగా కేంద్రం నుంచి మరో అవార్డును అందుకుంది. చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టిన తెలంగాణ నీటిపారుదల శాఖకు అవార్డు దక్కింది.

హ‌రీష్ కు ఎందుకు క్రెడిబిలిటీ ఇవ్వ‌డంలేదు..! స‌ర్వాత్రా ఇదే చ‌ర్చ‌..!!

హ‌రీష్ కు ఎందుకు క్రెడిబిలిటీ ఇవ్వ‌డంలేదు..! స‌ర్వాత్రా ఇదే చ‌ర్చ‌..!!

ఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వార్షికోత్సవం సందర్భంగా.. నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో అవార్డుల ప్రదానోత్సవం చేశారు. కేంద్రం మంత్రి ఆర్కేసింగ్ చేతుల మీదుగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు లభించింది. కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అవార్డును అందుకున్నారు.

English summary
Mission Bhageeatatha has been instrumental in protecting the ponds across Telangana. Former irrigation minister Harish Rao always has worked hard to play a vital role in the scheme. But the schemes are recognizable across the country, while winning awards and rewards, his name does not get anywhere..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X