హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘నయా భారత్’: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ..? బీజేపీ అధ్యక్ష పాలన దిశగా అడుగులు, అలర్ట్..

|
Google Oneindia TeluguNews

చెప్పినట్టే జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. స్వతహాగానే ముందుచూపు గల నేత కేసీఆర్.. బీజేపీ దుందుకుడు చర్యలను నిశీతంగా గమనిస్తున్నారు. 2022 చివరలో లేదంటే 2023లో జమిలి ఎన్నికలు.. కేంద్రంలో అధ్యక్ష ఎన్నికలపై కమిటీ ఏర్పాటు... లోక్‌సభ ఎన్నికలకు జాతీయ పార్టీలే పోటీ చేయాలనే నిబంధన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తనతో కలిసొచ్చే నేతలతో మరోసారి సంప్రదింపులను జరుపుతున్నారు. బీజేపీ చర్యకు ప్రతీ చర్య అన్నట్టు.. జాతీయస్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందరీ అభిప్రాయం తీసుకొని.. పార్టీకి 'నయా భారత్' అనే పేరు పరిశీలించినట్టు తెలుస్తోంది.

Recommended Video

Telangana Assembly Monsoon Session : Corona Test Must For All MLAs Before Attending The Session
మరోసారి తెరపైకి ఫెడరల్ ఫ్రంట్..

మరోసారి తెరపైకి ఫెడరల్ ఫ్రంట్..


బీజేపీ, కాంగ్రెస్ వైఖరిపై ఎప్పటినుంచే కేసీఆర్ గుస్సామీదున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వెళ్లే ముందు ఫెడరల్ ఫ్రంట్ అనీ హడావిడి చేశారు. ఎన్నికల తర్వాత.. లోక్ సభ ఎన్నికల సమయంలో కారు, సారు, పదహారు అని నినాదించారు. కానీ ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దీంతో తెలంగాణలో పాలనపై దృష్టిసారించారు. కానీ బీజేపీ మరింత దూకుడుగా అడుగులు వేయడంతో కేసీఆర్ కూడా అదేరీతిన స్పందిస్తున్నారు. 2022 చివరలో.. లేదంటే 2023లో జమిలి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది.

విజయ్ రూపానీ నేతృత్వంలో కమిటీ

విజయ్ రూపానీ నేతృత్వంలో కమిటీ

ఆరెస్సెస్‌ నేపథ్యం గల గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ నేతృత్వంలో అంతర్గత కమిటీని నియమించింది. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలిస్తోంది. ఒకవేళ అధ్యక్ష తరహా పాలన అమల్లోకి వస్తే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే బీజేపీ ఒకే దేశం.. ఒకే విధానం పేరు చెబుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎక్కువ రాష్ట్రాల్లో గెలిచి.. రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్ష పాలన చేపట్టాలని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.

కమలదళం వ్యుహాం.. కేసీఆర్ అలర్ట్

కమలదళం వ్యుహాం.. కేసీఆర్ అలర్ట్

బీజేపీ వ్యుహాన్ని కేసీఆర్‌ గ్రహించారు. వెంటనే అప్రమత్తమై బీజేపీ ఒకే దేశం ఒకే విధానానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలవడానికి అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం కేసీఆర్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తారా.. కలిసి వచ్చే ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకొంటారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే నాన్ బీజేపీ సీఎంలతో మంతనాలు జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌తో డిస్కషన్స్ చేసినట్టు సమాచారం.

బీజేపీ లోపాలు ఇవే.. కేసీఆర్ ఆరోపణలు

బీజేపీ లోపాలు ఇవే.. కేసీఆర్ ఆరోపణలు

పాకిస్థాన్‌ను నియంత్రించడం, జాతీయ భద్రత కాపాడడం, అంతర్జాతీయ సంబంధాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ ఇదివరకే దుయ్యబట్టారు. విద్యుత్, సాగునీటి విధానాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. 2,21,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా.. 1,80,000 మెగావాట్లను మాత్రమే దేశం యూజ్ చేసుకుంటుందని ఆరోపించారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నా, సాగునీటిని పూర్తిగా వినియోగించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ అంశాలను ప్రధాని మోదీకి చెప్పినా పట్టించుకోలేదని కేసీఆర్ ఆరోపించారు.

జీఎస్టీ.. కరోనా నేపథ్యంలో కస్సు బుస్సు

జీఎస్టీ.. కరోనా నేపథ్యంలో కస్సు బుస్సు

జీఎస్టీ పరిహారం ఇవ్వబోమని.. రాష్ట్రాలు అప్పులు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం అగ్గిరాజేసింది. కరోనాను సమర్థంగా నిలువరించడంలోనూ కేంద్రం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయమని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించడం జాతీయ స్థాయిలోనూ తమకు అనుకూలంగా మారుతుందని భావించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీఆర్‌ఎస్ఎల్పీ సమావేశం సోమవారం జరగనంది. సమావేశంలో కేసీఆర్‌ జాతీయ రంగ ప్రవేశం, కొత్త పార్టీపై చర్చ జరిగే అవకాశం ఉంది. నేతలు ఆమోదం తెలిపితే తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది.

English summary
‘naya bharath’: telangana cm kcr will be establish new national party name is ‘new india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X