హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాయిని పాడెమోసిన కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా..కేసీఆర్ కంటతడి..

|
Google Oneindia TeluguNews

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధువులు రోదనల మధ్య.. అధికార లాంఛనాలతో అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. నాయినికి కడసారి వీడ్కోలు పలికేందుకు రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు వచ్చి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ.. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ..

పాడెమోసిన కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్

పాడెమోసిన కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్

నాయిని నర్సింహారెడ్డి పాడెను కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ మోసారు. ఆయనతో ఉన్న రుణానుబంధాన్ని తీర్చుకున్నారు. నాయినితో సన్నిహితంగా మెలిగిన వారు తీవ్ర భావోద్వేగానికి గురుయ్యారు. కార్మిక నాయకుడిగా, రాజకీయ నేతగా నాయిని చేసిన పోరాటం చరిత్రలో మిగిలిపోతుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో చేసిన పోరాటం గొప్పగా నిలుస్తోంది. టీఆర్‌ఎస్‌తో నాయినికి ఉన్న అనుబంధం చిరస్మరణనీయం ఉంటోంది.

కంటతడి పెట్టిన కేసీఆర్

కంటతడి పెట్టిన కేసీఆర్

నాయిని మరణవార్త విన్న సీఎం కేసీఆరే కంటతడి పెట్టారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి పనిచేశారు. హెచ్‌ఎంఎస్‌లో సామాన్య కార్యకర్తగా పనిచేసి.. అంచెలంచెలుగా ఎదిగారు. హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగారు. 1978లో జనతాపార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కార్మిక రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ నాయిని నర్సింహారెడ్డి రాణించి తనదైనముద్ర వేశారు.

Recommended Video

Dubbaka ByPolls : Congress Key Leaders Participated In Campaign To Support Cheraku Srinivasa Reddy
 సోషలిస్ట్ పార్టీలో చేరి..

సోషలిస్ట్ పార్టీలో చేరి..

1958లో డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా ఆధ్వర్యంలో సోషలిస్టు పార్టీలో నాయిని సభ్యత్వం తీసుకున్నారు. నాయిని తండ్రి దేవారెడ్డి సోషలిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. అయితే ఆయనను పోలీస్‌ యాక్షన్‌లో కాల్చి చంపడంతో..పెద్దనాన్న కొడుకు అయిన రాఘవరెడ్డితో కలిసి దేవరకొండలో నాయిని నర్సింహారెడ్డి సోషలిస్టు పార్టీని స్థాపించారు. విద్యార్థి దశలో 1956లో వచ్చిన ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో, ముల్కి పాలన వ్యతిరేక పోరాటంలో, తెలంగాణలో ఆంధ్రాను విలీనం చేయవద్దని జరిగిన ఉద్యమంలో నాయిని నర్సింహారెడ్డి చురుకైన పాత్ర పోషించారు.

English summary
nayini narsimha reddy funerals completed in state government Formalities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X