హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదీ చాలదు.. ఇంకా డెవలప్ కావాల్సిందే, వజ్రోత్సవ వేడుకలు ప్రారంభించిన కేసీఆర్

|
Google Oneindia TeluguNews

స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి ప్రతి గడపకు తెలిసేలా చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించారు. జాతీయ జెండాను ఎగుర వేసి, జెండావందనం చేశారు. తర్వాత భరతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేశారు. జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ దేశంలో విలీనం అయిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పటికి తెలంగాణను బాగు చేసుకున్నామని.. ఇంకా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం నెగ్గకున్నా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిందని తెలిపారు. కొంత మంది గాంధీని కించ పరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

Recommended Video

రూటు మార్చిన వైఎస్ షర్మిల, ఈరోజు గవర్నర్ తో భేటీ *Telangana | Telugu OneIndia
 need to develop telangana state:cm kcr

తెలంగాణ బిడ్డ నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించటం అభినందనీయం అని చెప్పారు. దేశ భవిష్యత్తు కోసం పునరంకితం అవుదామని కేసీఆర్ చెప్పారు. త్యాగాలతో, పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి 75 సంవత్సరాలు స్వయం పాలనలో అప్రతిహాతంగా ముందుకుసాగుతున్న భారతావని వచ్చే 15వ తేదీకి పూర్తి చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు.

స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడవాడల అద్భుతంగా జరగాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నాయని... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు అందరు తమ పరిధిలో ఉజ్వలం నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఏయే సందర్భంలో ఎవరు త్యాగాలు చేశారు, ఎన్ని రకాల పోరాటాలు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆసువులు బాశారని.. మరణానికి వెనుకాడకుండా.. మడమ తిప్పకుండా పోరాటాలు చేశారని తెలిపారు.

English summary
need to develop telangana state telangana cm kcr said. he started Azadi Ka Amrit Mahotsav at hyderabad hicc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X