• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వామ్మో పెళ్లికొడుకు.. కోటీశ్వరుడినని బిల్డప్, యువతి ట్రాప్.. లక్షలు దోచాడు..!

|

హైదరాబాద్ : నా దగ్గర కోట్లున్నాయ్ అని ఓ రేంజ్ బిల్డప్ ఇచ్చాడు. పెళ్లి చేసుకుందాం రా అంటూ ప్రపోజ్ చేశాడు. అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న యువతికి పిట్ట కథలెన్నో చెప్పి మొత్తానికి ముగ్గులోకి దించాడు. ఆ తర్వాత అసలు కథ నడిపించాడు. క్రమక్రమంగా ఆమె నుంచి 6 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశాడు. అది చాలదన్నట్లు ఇంకా డబ్బులు కావాలని అడుగుతుండటంతో చివరకు మోసపోయానని గ్రహించారు సదరు యువతి.

కోట్లున్నాయ్.. అమెరికాలో సెటిలైపోదాం..!

కోట్లున్నాయ్.. అమెరికాలో సెటిలైపోదాం..!

ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు రెండేళ్ల కిందట పెళ్లయినప్పటికీ భర్తతో సరిపడక విడాకులు తీసుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఉండటం ఇష్టం లేక మూడు నాలుగు నెలల కిందట హైదరాబాద్ చేరుకున్నారు. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేసుకోవాలని వత్తిడి తేవడంతో సరేనంటూ ఓ మ్యాట్రిమోనిలో తన పర్సనల్ డిటెయిల్స్ పోస్ట్ చేశారు.

ఆమె ప్రొఫైల్ చూసి.. యష్‌ సలుజా పేరుతో ఓ యువకుడు నెల కిందట ఫోన్ చేశాడు. అమెరికాలో ఉద్యోగం అంటూ ఫోజులు కొట్టాడు. కోట్ల రూపాయల ఆస్తి ఉందంటూ బోల్తా కొట్టించాడు. ఐదేళ్ల కిందట తన భార్య చనిపోయిందని, ఒక బాబు ఉన్నట్లు స్టోరీ అల్లాడు. నాకు తోడు కావాలని.. మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుని అమెరికాలో హ్యాపీగా సెటిలైపోదామని ఊరించాడు.

---------------------

వామ్మో కేటుగాడు.. అమ్మాయిలను ఎర వేశాడు.. ప్రభుత్వ ఉద్యోగిని 5 లక్షలకు ముంచేశాడు

బ్యాంకులో 14 వేల కోట్లున్నాయంటూ బురిడీ

బ్యాంకులో 14 వేల కోట్లున్నాయంటూ బురిడీ

మీ ప్రొఫైల్ నచ్చిందని.. మా బాబును ప్రేమగా చూసుకుంటారనే నమ్మకం ఏర్పడిందని ఆమెను ట్రాప్‌లోకి దించాడు. తన తల్లి రెండేళ్ల కిందట చనిపోయారని.. మలేసియా బ్యాంకులో 200 కోట్ల డాలర్లు (14వేల కోట్ల రూపాయలు) డిపాజిట్‌గా ఉందని నమ్మించాడు. ఆ డబ్బు తన ఖాతాలోకి వచ్చే విధంగా త్వరలోనే మలేసియా వెళుతున్నానని.. తిరిగొచ్చాక పెళ్లి చేసుకుందామంటూ ఊరించాడు.

అలా మాటలు కలిపి కొన్నిసార్లు మాట్లాడక విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ నెల 9వ తేదీన ఫోన్ చేసి మలేసియాకు వెళ్తున్నానని బాధితురాలికి చెప్పాడు.

అయితే 14 వేల కోట్ల రూపాయల కరెన్సీ తనకు దక్కాలంటే అర్జెంట్‌గా 15 లక్షల రూపాయలు కట్టాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. అంతమొత్తం తన దగ్గర లేదని, ఆస్ట్రేలియాలోని తన స్నేహితుడు 10 లక్షలు ఇస్తున్నాడని నమ్మబలికాడు. ఒక రెండు లక్షలు సర్ధుబాటు చేయాలని కోరాడు. మరో 3 లక్షలు ఇతరుల దగ్గర తీసుకుంటానని మరో కథ అల్లాడు.

నమ్మించి.. మోసగించి.. 6 లక్షలకు పైగా కుచ్చుటోపి

నమ్మించి.. మోసగించి.. 6 లక్షలకు పైగా కుచ్చుటోపి

ఆ మోసగాడిని పూర్తిగా నమ్మిన బాధితురాలు 2 లక్షల రూపాయలను వాడు సూచించిన ఖాతాలో జమచేసింది. రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేశాడు. 3 లక్షలు ఇస్తానన్న వ్యక్తి హ్యాండ్ ఇచ్చాడని మరో 2 లక్షలు సర్దుబాటు చేయాలంటూ కోరాడు. సరేలే అంటూ ఆ రెండు లక్షలు కూడా వాడి ఖాతాలో జమచేశారు సదరు యువతి. అలా పదేపదే డబ్బు కావాలంటూ 6 లక్షల 28 వేల రూపాయలు వసూలు చేశాడు.

ఈ నెల 9వ తేదీ నుంచి ఆరు రోజుల వ్యవధిలో నాలుగు లక్షలు వసూలు చేసుకున్న నైజీరియన్ 14వ తేదీన మళ్లీ ఫోన్ చేశాడు. మరో రెండు లక్షలు అవసరమయ్యాయని.. అవి సర్దితే కేవలం మూడు గంటల్లో అడ్జెస్ట్ చేస్తానంటూ నమ్మించాడు. అప్పటికే ఆమె ఖాతాలో నగదు అయిపోవడంతో బంగారు ఆభరణాలు అమ్మి వాడి ఖాతాలో డిపాజిట్ చేసింది. మర్నాడే మళ్లీ ఫోన్ చేసి 30 వేల రూపాయలు తక్కువగా ఉన్నాయని ఎలాగైనా పంపించాలంటూ బతిమాలాడు.

అడిగినప్పుడల్లా ఇచ్చి.. తిరిగి అడిగేసరికి సీన్ రివర్స్

అడిగినప్పుడల్లా ఇచ్చి.. తిరిగి అడిగేసరికి సీన్ రివర్స్

సదరు మోసగాడు అడిగినప్పుడల్లా ఇచ్చుకుంటూ పోయేసరికి ఆమె ఖాతా ఖాళీ అయిపోయింది. ఇక చివరగా 28 వేల రూపాయలు మాత్రమే ఉండటంతో అదే మొత్తం పంపించింది. అయితే మూడు గంటల్లోపు అడ్జస్ట్ చేస్తానన్న సదరు వ్యక్తి ఒక్క రోజు గడిచినా డబ్బులు పంపకపోయేసరికి మరునాడు ఆమె ఫోన్ చేసింది. తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని.. తనకు కొంత డబ్బు పంపించాలని కోరారు.

అయితే తాను ఇప్పటికి ఇప్పుడు తిరిగి ఇచ్చే పరిస్థితిలో లేనని.. ఇంకా 3 లక్షల రూపాయలు కావాలని అడిగాడు. అప్పుడు గానీ సదరు యువతికి తాను మోసపోయాననే విషయం బోధపడలేదు. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఆ మేరకు దర్యాప్తు చేయగా సదరు మోసగాడు నైజీరియన్ ఢిల్లీలో ఉంటున్నట్లుగా గుర్తించారు. వాడిని పట్టుకునేందుకు ప్రత్యేక బ‌‌ృందం ఢిల్లీ వెళ్లనుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Neizerian Cheated Odisha Woman who worked in hyderabad. He taken her number from matrimonal website. He called her and proposed for marriage. He told that having crores of money, then cheated and collected 6 lakhs above from her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more