హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు: శ్రీరెడ్డి మరీ ఇంత బోల్డ్‌గా ఫైర్ అయ్యిందేంటి..?

|
Google Oneindia TeluguNews

దిశ అత్యాచార ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురైన సంగతి తెలసిందే. పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అయితే కొందరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలపై ప్రజలు మండిపడ్డారు. ఇలాంటి ప్రముఖుల్లో ఒకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ దిశ అత్యాచారంకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనుషులను చంపే హక్కు మనకు ఎవరిచ్చారని కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. రెండు దెబ్బలు వేయాలని చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే నిందితులు ఎన్‌కౌంటర్ అవడంతో మళ్లీ నెటిజెన్లు పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

నాడు వైయస్సార్..నేడు కేసీఆర్: అన్నింటికీ..బుల్లెట్ లాంటి సమాధానం: ఏం జరిగిదంటే...!నాడు వైయస్సార్..నేడు కేసీఆర్: అన్నింటికీ..బుల్లెట్ లాంటి సమాధానం: ఏం జరిగిదంటే...!

రెండు బెత్తం దెబ్బలు చాలన్న పవన్

రెండు బెత్తం దెబ్బలు చాలన్న పవన్

మనుషులను చంపే హక్కు లేదు.. రెండు బెత్తం దెబ్బలతో సరిపెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశ ఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా భగ్గుమంటోంది. శుక్రవారం ఉదయం నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురికావడంతో దేశం యావత్తు సంబురాలు చేసుకుంటున్న వేళ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు రెండు బెత్తం దెబ్బలు వేస్తే ఈ రోజు ఈ సంబురాలను చూసేవారమా అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. మహిళలు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. వారికి జేజేలు పలుకుతున్నారు.

జనసేనానిపై విరుచుకుపడ్డ నటి శ్రీరెడ్డి


ఇక ముందునుంచి మెగా ఫ్యామిలీ అంటే విరుచుకుపడే నటి శ్రీరెడ్డి ఎన్‌కౌంటర్ పై స్పందించింది. పవన్ కళ్యాణ్ మాట వింటేనే రెచ్చిపోయే శ్రీరెడ్డి... దిశా అత్యాచార ఘటన నిందితులు ఎన్‌కౌంటర్ జరిగిన సందర్భంగా పలు కీలక పోస్టింగ్‌లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే వారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఏపీ పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తన పోస్టులో కోరింది. దిశా కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పింది శ్రీరెడ్డి. అంతేకాదు కేసీఆర్‌కు జేజేలు పలికింది.

నెటిజెన్ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి

మరోవైపు జరిగిన ఎన్‌కౌంటర్‌ను మెజార్టీ ప్రజలు స్వాగతిస్తుండగా చాలా తక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. దిశాపై మృగాళ్లలా ప్రవర్తించడం తప్పే. అయితే వారికి శిక్ష పడేలా ప్రక్రియను వేగవంతం చేయాలని కొందరు నెటిజెన్లు కోరారు. పారదర్శకతతో కూడిన విచారణ, వేగవంతమైన విచారణ, సత్వర న్యాయం జరగాలని పోస్టులు పెట్టారు. ఈ ప్రక్రియను మొత్తం ఒక్క ఎన్‌కౌంటర్‌తో కూల్చడం సరికాదని చెప్పారు. ఎన్‌కౌంటర్ వల్ల కొత్త క్రైమ్‌ను పోలీసులు సృష్టించారని ఒక వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ఇందుకు సమాధానం కూడా మరికొందరు ఇచ్చారు. మన వ్యవస్థలో సత్వరన్యాయం అనేది జరగదని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించకూడదని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా అజ్మల్ కసబ్, నిర్భయ నిందితులే అని చెప్పారు. కసబ్‌ మారణహోమం సృష్టించినట్లు సాక్ష్యాలు ఉన్నప్పటికీ అతన్ని ఉరితీసేందుకు కొన్నేళ్లు సమయం తీసుకున్నారని.. ఇక నిర్భయ కేసలో నిందితులకు ఇంకా ఉరిశిక్ష వేయలేదని ఉదహరించారు.

English summary
Prime accused in Disha rape and murder case have been encountered in the early hours on Friday. People hailed the police and the Telangana govt.In this back drop netizens took a shot at Janasena Chief Pawan Kalyan for saying that the accused should be hit with a stick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X