• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమెజాన్.. ఏంటీ పని? జనతా కర్ఫ్యూ రోజున హైదరాబాద్ ఆఫీస్ వర్కింగ్.. ఉద్యోగుల గగ్గోలు..

|

రెక్కాడితేగానీ డొక్కాడని రోజుకూలీలు సైతం కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. మహానగరాల నుంచి మారుమూల పల్లెల దాకా ప్రజలెవరూ బయటికి రావడంలేదు. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. తెలంగాణలోనైతే సీఎం కేసీఆర్ సూచనతో జనతా కర్ఫ్యూ 24 గంటలపాటు కొనసాగనుంది.

కర్ఫ్యూ ఎలా కొనసాగుతున్నదో చూద్దామని రోడ్ల పైకి వచ్చేందుకు ప్రయత్నించిన ఔత్సాహికులకు పూలు చేతికిచ్చిమరీ వెనక్కి పంపుతున్నారు పోలీసులు. సంఘటిత పోరాటం ఇంత గొప్పగా సాగుతున్నవేళ.. ప్రఖ్యాత అమెజాన్ సంస్థ మాత్రం.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి.. హైదరాబాద్ లోని ఆఫీసును యథావిధిగా తెరిచిఉంచడం కలకలం రేపుతున్నది.

జనతా కర్ఫ్యూ రోజున కూడా మమ్మల్ని పని చేయడానికి రమ్మన్నారంటూ హైదరాబాద్ అమెజాన్ ఆఫీసుకు చెందిన ఉద్యోగి ఒకరు ఆవేదనతో ఈ ఫొటోలను షేర్ చేశారు. నిమిషాల్లోనే అవి కాస్తా వైరల్ అయ్యాయి. ప్రఖ్యాత జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అమెజాన్ చర్యను తప్పు పట్టారు. సిటీ మొత్తం లాక్ డౌన్ అయినవేళ.. అమెజాన్ కు మాత్రమే పనిచేసుకోడానికి పర్మిషన్ దక్కిందా? అని ప్రశ్నించారు. అయితే..

netizens slams Amazon for allegedly working at Hyderabad office on Janata Curfew day
  Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

  జనతా కర్ఫ్యూ రోజున కూడా అమెజాన్ తన ఉద్యోగులతో ఎందుకు పనిచేయిస్తోందనే కారణాలు తెలియాల్సిఉంది. మందులు లేదా ఇతర అత్యవసర సరుకుల పంపిణీ కోసమే కొద్ది మంది ఉద్యోగుల్ని కేటాయించారా? లేక రోజువారీ పనినే చేయిస్తున్నారా అన్నది వెల్లడి కావాల్సి ఉంది. ఓలా, ఉబెర్ లాంటి ఇతర మల్టీనేషన్ సర్వీసు సంస్థలు కూడా జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సేవలు నిలిపేసిన నేపథ్యంలో అమెజాన్ చర్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి, సదరు ఫొటోలను జోడిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. అసలీ ఫొటోలు ఒరిజినలేనా? లేక ఫేకా? అనే క్లారిటీతోపాటు, సంస్థ అధికారిక స్పందన కూడా వెలువడాల్సిఉంది.

  English summary
  as nation wide Janata Curfew is successfully conduction on sunday, amazon allegedly have been asked employees to come to office ay hyderabad. pics went viral and netizens complaint to govt in this issue
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more