హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ జరిమానాలతో మందుబాబుల బెంబేలు: ప్రత్యేక కోర్టుల సంచలన తీర్పు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసిన కొత్త మోటారు వాహనాల సవరణ చట్టం2019ను తెలంగాణలో అమలు చేయమని, అంత భారీ మొత్తంలో జరిమానాలను వసూలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు కొంత ఊపిరిపీల్చుకున్నారు.

ప్రాణం తీసిన కొత్త మోటారు చట్టం..!! బలవంతంగా కారు ఆపి.. తనిఖీలు, వాగ్వివాదంతో ఒత్తిడికి గురై...ప్రాణం తీసిన కొత్త మోటారు చట్టం..!! బలవంతంగా కారు ఆపి.. తనిఖీలు, వాగ్వివాదంతో ఒత్తిడికి గురై...

భారీ జరిమానాలు

భారీ జరిమానాలు

అయితే, ఈ కొత్త వాహనాల చట్టంను హైదరాబాద్ ప్రత్యేక కోర్టులు అమలు చేయడం ప్రారంభించాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 9 మంది వాహన చోదకులకు రూ. 10,500 చొప్పున జరిమానా విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశాయి.

కొత్త వాహనాల చట్టం ప్రకారమే..

కొత్త వాహనాల చట్టం ప్రకారమే..

వారాంతాల్లో పట్టుబడిన మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. దీంతో మందుబాబులకు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలను ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులు విధించారు. మోటారు వాహనాల సవరణ చట్టంలోని నిబంధనలను పరిశీలించి ఎంవీ చట్టం 185(ఎ) ప్రకారం కొత్త జరిమానాలను విధించాలని న్యాయూర్తులు నిర్ణయించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులకు జరిమానాతోపాటు జైలు శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉండటంతో కొత్త జరిమానాలను విధించవచ్చు.

గత నెల నుంచే..

గత నెల నుంచే..


కాగా, సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహనాల సవరణ చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రాలు ఈ సవరణ చట్టం ప్రకారం జరిమానాలు విధించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు పాత జరిమానాలనే కొనసాగిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం కొత్త వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలను కొత్త చట్టం ప్రకారం ఉన్న జరిమానాలను కొంత తగ్గించి విధిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ రాష్ట్రాల్లో కొత్త చట్టం ప్రకారం జరిమానాలను విధించమని ప్రకటించాయి.

నిబంధనలు.. ఛార్జీలు

నిబంధనలు.. ఛార్జీలు

కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ. 500-10,000 వరకు జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అంతేగాక, ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలూ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే రూ. 1000 జరిమినా విధిస్తారు. నిర్ణీత వేగం కంటే ఎక్కువ వేగంతో వెళితే.. రూ.1000-2,000 వరుక జరిమానా విధించడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితితిలో ప్రయాణించే వాహనాలు అంబులెన్స్, ఫైరింజిన్లకు దారి ఇవ్వకపోతే రూ. 10వేలు జరిమానా విధిస్తారు. అనర్హత వేటుపడిన డ్రైవర్ వాహనం నడిపితే రూ. 10వేలు జరిమానా విధిస్తారు.

English summary
new motor vehicle act fines applied in drunk and drive
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X