హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో రద్దుకు అసెంబ్లీ ఆమోదం - సవరణలు లేకుండానే ఏకగ్రీవంగా

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు సహా మొత్తం నాలుగు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020, వీఆర్వో ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల ప‌ద‌వుల ర‌ద్దు బిల్లు, పంచాయ‌తీరాజ్ 2020(స‌వ‌ర‌ణ) బిల్లు, పుర‌పాల‌క చ‌ట్టం 2020 (స‌వ‌ర‌ణ) బిల్లులకు శాస‌న‌స‌భ శుక్రవారం ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లులు ఆమోదం పొందాయని ప్రకటించిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.. సభను సోమవారానాకి వాయిదా వేశారు.

సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన... రేపటి నుంచి ఆ రిజిస్ట్రేషన్లు బంద్... ఇది ఆరంభం మాత్రమే...సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన... రేపటి నుంచి ఆ రిజిస్ట్రేషన్లు బంద్... ఇది ఆరంభం మాత్రమే...

నూత‌న రెవెన్యూ బిల్లును ఈ నెల 9వ తేదీన స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లుపై శుక్ర‌వారం సుదీర్ఘంగా చ‌ర్చించారు. స‌భ్యులంద‌రూ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ సమాధానాలిచ్చారు. చర్చ ముగిసిన అనంత‌రం ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే ఈ బిల్లుల‌కు ఆమోదం లభించింది. అధికార టీఆర్ఎస్ సభ్యులు బ‌ల్ల‌లు చ‌రుస్తూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఆ చట్టాలతో ముస్లింలకే ఎక్కువ నష్టం - ఆలయ భూముల్ని కాపాడండి - కొత్త రెవెన్యూ చట్టానికి ఎంఐఎం మద్దతుఆ చట్టాలతో ముస్లింలకే ఎక్కువ నష్టం - ఆలయ భూముల్ని కాపాడండి - కొత్త రెవెన్యూ చట్టానికి ఎంఐఎం మద్దతు

New Revenue Act Bill, Abolition of vro system and other bills Passed in Assembly

కొత్త రెవెన్యూ చట్టంలో వక్ఫ్, దేవాదాయ శాఖ, దర్గాల భూముల్ని పరిరక్షించే క్లాజులు, గ్రీన్ జోన్లలో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టకుండా కఠిన నిబంధనలు చేర్చాలంటూ ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. వీఆర్వో వ్యవస్థ రద్దయిన దరిమిలా ధరణి పోర్టల్ ను ఎవరు నిర్వహిస్తారన్న ప్రశ్నకు ''ప్రభుత్వమే నిర్వహిస్తుంది’’అన్న సమాధానం తప్ప వివరణ లేకుండానే బిల్లులు ఆమోదం పొందాయి.

కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించడంతో శుక్రవారమే గెజిట్ నోట్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. ఇకపై తహశీల్దార్లు జాయింట్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వారి ఆధ్వర్యంలోనే జరుగనుంది. వ్యవసాయేతర భూములు మాత్రం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే కొనసాగుతుంది. భూములకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడే ధరణి పోర్టల్‌లో పొందుపరుస్తూ.. రిజిస్ట్రేషన్‌ జరిగినరోజే మ్యుటేషన్‌‌ ప్రక్రియ కూడా పూర్తిచేస్తారు. వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో ఆ ఉద్యోగులను ఇతర శాఖల్లో నియమించనున్నారు.

English summary
telangana asembly on friday passes new revenue act bill, The Telangana Abolition of the Posts of VROs Bill, 2020, The Telangana Rights in Land and Pattadar Passbooks Bill, 2020, The Telangana Municipal Laws (Amendment) Bill, 2020, and The Telangana Panchayat Raj (Amendment) Bill, 2020. after cm kcr speech, assembly speakeer pocharam srinivasa reddy annunced that all bills passsed without any Amendments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X