హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీకట్లో ఉంచి పూజలు.. దెబ్బతిన్న పేగులు, లివర్ -ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఉదంతంలో మిస్టరీ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం మరింత సంచలనంగా మారింది. కిడ్నాప్, గ్యాంగ్ రేప్ అంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన చేసిన ఆమె.. బుధవారం బలవన్మరణానికి పాల్పడినట్లు కథనాలు వచ్చాయి. అయితే, ఆమె మరణానికి గల కారణాలు, అందుకు దారి తీసిన పరిస్థితులు ఇప్పుడు మిస్టరీగా మారాయి. ఇప్పటికే ఈ ఘటనాక్రమంపై విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో పోలీసులు తదుపరి దర్యాప్తును పకడ్బందీగా కొనసాగిస్తున్నారు.

అందుకే విష్ణును చెప్పుతో కొట్టాను -అమరావతి నేత శ్రీనివాసరావు వివరణ -లైవ్‌లో దాడిపై పెను దుమారంఅందుకే విష్ణును చెప్పుతో కొట్టాను -అమరావతి నేత శ్రీనివాసరావు వివరణ -లైవ్‌లో దాడిపై పెను దుమారం

అనుమానాస్పద మృతి కేసు..

అనుమానాస్పద మృతి కేసు..

ఈనెల 10న తాను కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కు గురయ్యానంటూ బాధిత విద్యార్థి ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం మొదలైన సంగతి తెలిసిందే. కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. అసలు కిడ్నాప్, గ్యాంగ్ రేప్ జరగలేదని, ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉండలేక ఆ విద్యార్థిని నాటకమాడిందని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరించారు. కిడ్నాప్, రేప్ నాటకమని నిర్ధారణ అయిన తర్వాత సదరు విద్యార్థినిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించగా, అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. శారీరక, మానసిక ఒత్తిడితో బాధపడుతోన్న ఆమెకు చికిత్స కూడా చేయించారు. కానీ అంతలోనే మంగళవారం(23న) రాత్రి ఇంట్లో ఉన్న బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు మింగేసిందని, బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయిందని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. తొలుత దీన్ని ఆత్మహత్య కేసుగా భావించినా, చివరికి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై..

ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం -4తప్ప మిగతావన్నీ ప్రైవేటుకే: ప్రధాని మోదీ సంచలనం -పూర్తి వివరాలివేప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం -4తప్ప మిగతావన్నీ ప్రైవేటుకే: ప్రధాని మోదీ సంచలనం -పూర్తి వివరాలివే

ఎలా చనిపోయింది?

ఎలా చనిపోయింది?

కిడ్నాప్ డ్రామా తర్వాత బాధిత విద్యార్థిని ఘట్‌కేసర్‌లోని తన అమ్మమ్మ ఇంట్లోనే ఉంటోంది. జరిగిన సంఘటనలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అప్పట్నుంచీ ఆహారం సరిగా తీసుకోవడంలేదని తెలుస్తోంది. మంగళవారం నాటికి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ వైద్యులు గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అదే రోజు గాంధీ వైద్యులు ఆమెను పరీక్షించి.. మానసిక ఒత్తిడి వల్లనే ఇలా ఉందని తెలిపి, బుధవారం ఉదయం మరోసారి ఆస్పత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు. ఆ రోజు రాత్రి..

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

మంగళవారం రాత్రి తల్లిదండ్రులతోనే కలిసున్న యువతి.. బుధవారం తెల్లవారేసరికి విగతజీవిలా కనిపించింది. మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. షుగర్‌, బీపీ మాత్రలు వేసుకుందామని చూడగా.. వాటిలో 15 మాత్రల దాకా తక్కువ ఉన్నట్టు గమనించానని, బహుశా ఆ మాత్రలు మింగడం వలనే మంగళవారం తమ కుమార్తె అస్వస్థతకు గురైందని, బుధవారం ఉదయం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పినట్లు తండ్రి పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో అసలేం జరిగింది..? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈలోపే..

ఫోరెన్సిక్ రిపోర్టు తర్వాతే..

ఫోరెన్సిక్ రిపోర్టు తర్వాతే..

బుధవారం ఉదయానికి ప్రాణాలు కోల్పోయిన బాధిత విద్యార్థిని మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అమ్మమ్మ ఇంటివద్దే అంత్యక్రియలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసు కావడంతో పోస్టుమార్టం రిపోర్టులో ఏం తేలుతుందోననే ఉత్కంఠ ఏర్పడింది. యువతి మరణానికి గల కారణాలను గాంధీ వైద్యులు కచ్చితంగా ఇంకా నిర్ధారించలేదు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసిన పోలీసులు.. యువతి శరీర భాగాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కు పంపారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు తర్వాతే విద్యార్ధిని మృతిపై క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు..

చీకట్లో పూజలు.. దెబ్బతిన్న భాగాలు..

చీకట్లో పూజలు.. దెబ్బతిన్న భాగాలు..

ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతికి సంబంధించి కొత్త కాణాలంటూ కొన్ని విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. కిడ్నాప్ డ్రామా తర్వాత శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన ఆమె తీవ్ర మనస్తాపంతో ఆహారం తీసుకోలేదని, ఆమె సమస్యలన్నీ దూరం అయ్యేందుకు, అలా ఆహారం లేకుండానే విద్యార్ధినిని 11 రోజులుగా చీకట్లో ఉంచి తల్లిదండ్రులు పూజలు చేసినట్లు ప్రముఖ టీవీ ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, పోస్ట్ మార్టంకు సంబంధించిన ప్రాథమిక రిపోర్టులో.. విద్యార్థిని శరీరంలోని పేగులు, లివర్ దెబ్బతిన్నాయని ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై పూర్తిగా సమాచారం తెలియరాలేదు.

English summary
New Twist In Ghatkesar B Pharmacy Student Suicide Case. girl student suicide, who created a sensation all over Telangana in Fake Kidnap, Rape Case, has become even more sensational. Family members say she committed suicide by swallowing sugar tablets. However, autopsy preliminary report says there is a mystery behind the death of the student. police yet to conform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X