హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

31 రాత్రి పోలీసు నిబంధలు ఇవే.... తాగి పట్టుపడితే...10 వేలు... !

|
Google Oneindia TeluguNews

31 డిశంబర్ వచ్చిందంటే ప్రజల్లో కొత్త ఉత్సహాం పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ...నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలోనే అర్థరాత్రి వేడుకల్లో మునిగిపోతారు. అయితే నూతన సంవత్సర వేడుకలు కొన్ని సంధార్భాల్లో విషాదంగా మారనున్న నేపథ్యంలోనే పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా వేడుకల్లో ఎలాంటీ అపశ్రుతులు జరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగర పోలీసులు పలు నిబంధలు విధించారు. డ్రంకన్ డ్రైవింగ్ దారులకు పోలీసులు చుక్కలు చూపించేందుకు సిద్దమవుతున్నారు.

నిబంధనలు ఎవరికి...

నిబంధనలు ఎవరికి...

ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సర వేడుకల్లో బాగంగా రోడ్డు ప్రమాదాలు ,ఇతర దుర్ఘటనలు జరగకుండా ప్రశాంతంగా వేడుకలను నిర్వహించేందుకు హైదరాబాద్ నగర పోలీసులు పలు నిబంధలు , మార్గదర్శకాలు రూపోందించారు. వేడుకలు నిర్వహించే నిర్వాహాకులు ముఖ్యంగా హోటళ్లు, పబ్‌ యజమానులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హుకుం జారీ చేశారు.

 ఇవే నిబంధనలు

ఇవే నిబంధనలు

కాగా నూతన సంవత్సర వేడుకలను సాధరణంగా రాత్రి మొత్తం నిర్వహించకుండా నిబంధన విధించారు. ఇందులో భాగాంగనే రాత్రి 8 గంటల నుండి అర్థరాత్రీ ఒంటిగంటవరకు మాత్రమే నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక వేడుకల నిర్వహాకులు పోలీసుల అనుమతి తీసుకుని ఆయా ప్రాంతాల్లో సీసీ కేమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కార్యాక్రమాల్లో ఆశ్లీలం ఉండకుండా చూసుకోవాలి. 45 డెసిబుల్స్ మ్యూజిక్ సిస్టం కంటే ఎక్కువగా ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.

డ్రంకెన్ డ్రైవ్‌కు 10 వేల జరిమానా...

డ్రంకెన్ డ్రైవ్‌కు 10 వేల జరిమానా...

మరోవైపు 31 అర్థరాత్రి ఆల్కహాల్ లేకుండా వేడుకలు సర్వసాధరణంగా జరిగే అవకాశం ఉండదు... కాని పోలీసులు డ్రంకన్ డ్రైవింగ్‌పై నజర్ పెట్టారు. ఈ సారి కూడ డ్రైంకన్ డ్రైవింగ్ కోసం ప్రత్యేక బృందాలు పర్యవేక్షనున్నట్టు తెలిపారు. ఈ నేథ్యంలోనే డ్రంకన్ డ్రైవింగ్ లోపట్టుపడిన వారిపై 10 వేల రూపాయల భారీ జరిమాన విధించడం తోపాటు వాహానాన్ని సీజ్ చేయనున్నారు. ఇక దిశ సంఘటన జరిగిన నేపథ్యంలోనే అనుమానస్పద వ్యక్తులు సంచరించినా..ఎదైనా ఇబ్బందులు ఎదురైనా 100కు డయల్ చేయాలని సూచించారు. దీంతోపాటు సైబారాబాద్‌కు 9490617444, రాచకొండ కమీషనరేట్లకు . 9490617111 వాట్సప్ నెంబర్ల ద్వార సమాచారం అందించాలని తెలిపారు.

English summary
hyderabad police have released number of rules and guidelines to help the public in the new Year's Eve in city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X