హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబ‌రాన్నంటిన సంబ‌రాలు..! కోటి ఆశ‌ల‌తో కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జానికం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : 2018 యేడాది ఎంత ఆనందం నింపిందో అంతే విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోంయింద‌ని చెప్పొచ్చు. ఆనందం, విషాదం, నవ్వులు, కన్నీళ్ళు అన్నీ వివిధ పాళ్ళలో తనలో కలిపేసుకొని వెళ్ళిపోయింది 2018. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. 2019కి స్వాగతం పలుకుతూ చిన్న పెద్దా తేడా లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్‌, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత‌గానో అల‌రించాయి. 2019కి స్వాగతం పలుకుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

Recommended Video

New Year Celebrations In Australia, London, Dubai And Around The Globe
అట్ట‌హాసంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు..! కోటి కాంతుల మ‌ద్య కొత్త యేడాది సంబ‌రాలు..!!

అట్ట‌హాసంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు..! కోటి కాంతుల మ‌ద్య కొత్త యేడాది సంబ‌రాలు..!!

ప్రంపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పలు దేశాల్లో కోట్లాది మంది జనం కోటి కాంతులతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మొదట న్యూఈయర్‌ వేడుకలు ప్రారంభమ్యాయి.జపాన్‌, సింగపూర్‌, ఇండియా, దుబాయిల్లో కొత్త ఏడాది సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రంగురంగుల కాంతులను వెదజల్లే బాణాసంచా కాల్చారు. ప్రజలు ఆనందోత్సవాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఒకరినొకరు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరాల్లో రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లు సందడిగా మారాయి. పల్లెల్లో సైతం ప్రజలు రెట్టించిన ఉత్సాహాంతో న్యూ ఈయర్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

 కొత్త సంవత్సర సందర్భంగా కిటకిటలాడిన చర్చీలు, ఆలయాలు కొత్త సంవత్సర సందర్భంగా కిటకిటలాడిన చర్చీలు, ఆలయాలు

భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని చాటిని ప్ర‌జ‌లు..! కిక్కిరిసి దేవాల‌యాలు, ప్రార్థ‌నా మందిరాలు..!!

భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని చాటిని ప్ర‌జ‌లు..! కిక్కిరిసి దేవాల‌యాలు, ప్రార్థ‌నా మందిరాలు..!!

ఆలయాలు, చర్చిలు జనంతో రద్దీగా మారాయి. రంగురంగుల విద్యుత్‌ దీపాలతో ఆలయాలు, చర్చిలు ముస్తాబు చేశారు. పలు ఆలయాలు తెల్లవారు జామునే తెరిచారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనాలు కొనసాగాయి. నూతన సంవత్సర సందర్భంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్ వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంట గ్యాస్‌ ధర కూడా తగ్గింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా బలపడడం ఇందుకు కారణంగా విశ్లేషించింది.

భార‌త గ్రుహిణుల‌కు కొత్త సంవ‌త్స‌ర కానుక‌..! వంట గ్యాస్ ధ‌ర త‌గ్గించిన కేంద్రం..!!

భార‌త గ్రుహిణుల‌కు కొత్త సంవ‌త్స‌ర కానుక‌..! వంట గ్యాస్ ధ‌ర త‌గ్గించిన కేంద్రం..!!

రాయితీ వంటగ్యాస్‌ సిలిండర్‌ 14.2 కిలోల ధరను రూ.5.91లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.120ల ధర తగ్గించింది. ఈ వారంలో గ్యాస్‌ ధర తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఇంతకు ముందు నంబర్‌30న రాయితీ సిలిండర్‌పై రూ.6.52లు, రాయితీయేతర సిలిండర్‌పై రూ.133ల మేర ధరలు తగ్గించారు. మళ్లీ తాజాగా ఇపుడు ధర తగ్గించారు. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో వంట గ్యాస్‌ ధరలు తగ్గనున్నాయి. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి కొత్త ధరలు అమల్లో ఉంటాయని ఐఓసీ ప్రకటించింది.

కొత్త సంవ‌త్స‌ర సైక‌తి శిల్పం రెడీ..! ప‌ర‌వశించిపోతున్న పూరీ ప్ర‌జానికం..!!

కొత్త సంవ‌త్స‌ర సైక‌తి శిల్పం రెడీ..! ప‌ర‌వశించిపోతున్న పూరీ ప్ర‌జానికం..!!

అంతర్జాతీయ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ కొత్త సంవత్సర వేళ పచ్చదనాన్ని పెంచండి అంటూ పచ్చదనంతో కూడిన సైకతశిల్పాన్ని రూపొందించారు. మొక్కలు నాటండి...పచ్చదనాన్ని పెంచండి అంటూ సామాజిక సందేశంతో కూడిన సైకతశిల్పాన్ని ఒడిస్సా బీచ్ లో రూపొందించారు. పర్యావరణ పరిరక్షణకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటండి అంటూ సుదర్శన్ తన సైకత శిల్పం ద్వార ప్రజలకు సందేశాన్ని అందించారు. కొత్త సంవత్సర వేళ పూరి నగర ప్రజలు ఈ సైకత శిల్పాలను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

English summary
The New Year celebrations began throughout the year. In many countries, millions of people have welcomed the new year with crooks. Fireworks fired with colorful light baked. People greeted the new year with nice celebrations. mutually congratulated each other. Restaurants, pubs and bars have become bustling in cities. In the villages also participated in the New Year celebrations with the enthusiasm of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X