హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha case విచారణ: పోలీసులను ప్రశ్నిస్తున్న ఎన్‌హెచ్ఆర్సీ, అంశాల ఆధారంగా నివేదిక

రెవెన్యూ అధికారు ఎంక్వైరీలో

|
Google Oneindia TeluguNews

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. తెలంగాణ పోలీసు అకాడమీలో పోలీసులు రెవెన్యూ అధికారులను బృందం ప్రశ్నించనుంది. దీంతో ఎన్‌కౌంటర్‌కి సంబంధించి విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడుగురు సభ్యుల బృందం.. ఎన్‌హెచ్ఆర్సీకి నివేదిక సమర్పిస్తే.. వాటి నివేదిక ఆధారంగా నోటీసులు జారీచేస్తారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్:పాలమూరు ఆస్పత్రి నుంచి చటాన్‌పల్లి వద్దకు ఎన్‌హెచ్‌ఆర్సీ, మీడియాకు..దిశ నిందితుల ఎన్‌కౌంటర్:పాలమూరు ఆస్పత్రి నుంచి చటాన్‌పల్లి వద్దకు ఎన్‌హెచ్‌ఆర్సీ, మీడియాకు..

 తొలిరోజు ఇలా..

తొలిరోజు ఇలా..

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత శనివారం ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రానికి వచ్చారు. తొలుత మహబూబ్‌నగర్‌లో భద్రపరిచిన మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మృతదేహాలను పరిశీలించారు. అక్కడే ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టానికి సంబంధించి సీడీ తీసుకొని.. వైద్యులను కూడా పోస్టుమార్టం గురించి అడిగారు. ఆ రోజు రాత్రి ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి ప్రాంతాన్ని పరిశీలించారు.

రెండోరోజు

రెండోరోజు

మరునాడు పోలీసు అకాడమీలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి, దిశ సోదరిని ప్రశ్నించారు. దిశ ఎప్పుడూ ఫోన్ చేశారు. ఏం చెప్పారు. ఆడియో సంభాషణల గురించి అడిగారు. తర్వాత నిందితుల బంధువులను కూడా ప్రశ్నించారు. వారి వాదనను రికార్డ్ చేశారు. అంతకుముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై, కానిస్టేబుల్‌ను పరామర్శించి, ప్రశ్నించారు. ఎన్‌హెచ్ఆర్సీ బృందం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

నేటితో పూర్తి..

నేటితో పూర్తి..

సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారుల నుంచి వివరణ తీసుకుంటారు. ఎన్‌కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది. ఎన్నిగంటల సమయంలో అక్కడికి వెళ్లారు అనే అంశాలపై పోలీసులను గుచ్చి గుచ్చి అడుగుతారు. చటాన్ పల్లి రెవెన్యూ సిబ్బందిపై కూడా పలు అంశాలపై ఆరాతీస్తారు. ఎన్ కౌంటర్ జరిగాక పంచనామా చేసిన వారిని.. మృతదేహాలు ఎలా పడి ఉండేవి, రక్తపు మరకులు ఉండేవా.. తదితర అంశాలపై ప్రశ్నిస్తారు. వారు చెప్పే అంశాల ఆధారంగా నివేదిక పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరో పిటిషన్

మరో పిటిషన్

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం విచారించనుంది. వాస్తవానికి ఉదయం 10.30 గంటలకు విచారించాల్సి ఉన్నా, మరో పిటిషన్ దాఖలు కావడంతో రెండు కలిపి ఓకేసారి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. హైకోర్టు విచారణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ఆధారంగా పాలమూరు ఆస్పత్రిలో ఉన్న నిందితల మృతదేహాల అంత్యక్రియలు ఆధారపడి ఉన్నాయి. శుక్రవారం జరగాల్సిన అంత్యక్రియలు హైకోర్టు, ఎన్‌హెచ్ఆర్సీ బృందం పర్యటనతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

English summary
nhrc to question by police, revenue officers. after that submit the report to department
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X