హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రబాద్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్, ఎన్ఐఏ తనీఖీలు

|
Google Oneindia TeluguNews

నేడు హైద్రబాద్ శివారు ప్రాంతమైన మైలార్‌దేవ్ పల్లి పరిధిలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు శాస్త్రి పురం కు చెందిన ఓ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. గతంలో ఐసిస్ సానుభూతిపరులుగా ఉన్న ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు, అనంతరం యువకిడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్టు సమాచారం. కాగ మరికొంతమందిని కూడ ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఐసిస్ సానుభూతిపరుల సమాచారంతో సోదాలు

ఐసిస్ సానుభూతిపరుల సమాచారంతో సోదాలు

గత ఎనిమిది నెలల క్రితం పట్టు బడిన ఐసిస్ సానుభూతిపరులైన అబ్ధుల్ బాసిత్, అబ్ధుల్ ఖాదీర్ లు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు ఉదయం ఎన్ఐఏ అధికారులు మైలార్ దేవ్ పల్లితోపాటు పాతబస్తిలో పలుచోట్ల తనీఖీలు నిర్వహంచారు. సుమారు ఎనిమిది చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే శాస్త్రిపురంలో తాహ మసూద్ అనే యువకుడు కొంత కాలంగా తన కుటుంభంతో కలిసి ఇల్లు అద్దేకు తీసుకుని ఉంటున్నాడు. కాగా తాహా మసూద్ కార్ణటకకు చెందిన వ్యక్తి, అయితే ఇతను ఐసిస్ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు పాతబస్తిలో సైతం సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదీర్ లను సంప్రదింపులు జరిపిన తహా మసూద్,

అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదీర్ లను సంప్రదింపులు జరిపిన తహా మసూద్,

శనివారం ఉదయం అరెస్ట్ అయిన తహ మసూద్, ఢిల్లి జైలులో ఉన్న అబ్దుల్ బాసిత్ తోపాటు అబ్దుల్ ఖాదీర్ లతో సంప్రదింపులు జరిపినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించనట్టు తెలుస్తోంది. కాగా తాహ మసూద్ ను పోలీస్ లు విచారించనున్నారు. విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయి.

2016 లో అప్ఘానిస్తాన్ , సిరియా వెళ్లేందుకు బాసిత్ ప్రయత్నం, 8 నెలల క్రితం అరెస్ట్

2016 లో అప్ఘానిస్తాన్ , సిరియా వెళ్లేందుకు బాసిత్ ప్రయత్నం, 8 నెలల క్రితం అరెస్ట్

ఢిల్లి జైల్లో ఉన్న అబ్ధుల్ బాసిత్ 2014 లో సిరియా వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం 2016 లో కూడ అఫ్ఘానిస్తాన్ వెళ్లేందుకు కూడ ప్రయత్నించినట్టు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తెలిసింది. ఈనేఫథ్యంలోనే బాసిత్ ఐసిస్ ఉగ్రవాది అద్నాన్ తో నిత్యం సంప్రదింపుల జరిపి ఉగ్రవాదం వ్యాప్తికి ప్రయత్నాలు చేశారు.మరో ఢిల్లిలో ఓ ఆర్ఎస్ఎస్ నాయకుడిని హత్య చేసే కుట్ర తెరలేపినా, అది సక్సెస్ కావడంతో బాసిత్ హైద్రబాద్ తిరిగి వచ్చాడు. దీంతో పసిగట్టిని ఎన్ఐఏ అధికారులు వారిని 8 నెలల క్రితం అబ్దుల్ బాసిత్ తోపాటు అబ్ధుల్ ఖాదీర్ ను అరెస్ట్ చేశారు.

English summary
The National Investigation Agency (NIA) on Saturday carried out searches at the residences of associates of alleged terror suspect Abdul Basith who is charge-sheeted by the agency in the Abu Dhabi ISIS module case.The NIA sleuths took Basith's associate, Taha and two more into custody from Kings colony in Sastripuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X