హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణం: విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవన్న నివేదిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చదువుకునే విద్యార్థులకు ఏ తరగతికి ఆ తరగతి సెపరేట్‌గా ఉంటే బాగుంటుంది. అయితే తెలంగాణలో సగానికి పైగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు వేర్వేరు తరగతుల్లో కూర్చోవడం లేదని ఓ నివేదిక వెల్లడించింది. 2018కి గాను రాష్ట్ర వార్షిక విద్యా నివేదిక పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

 ఒక గదిలోనే అన్ని తరగతి విద్యార్థులు

ఒక గదిలోనే అన్ని తరగతి విద్యార్థులు

తెలంగాణ రాష్ట్రంలో 49శాతంకు పైగా స్కూళ్లల్లో నాల్గవ తరగతి చదివే విద్యార్థులు తమ క్లాస్‌రూంలలో కాకుండా ఇతర తరగతి విద్యార్థులతో కలిసి కూర్చుంటున్నారని నివేదిక వెల్లడించింది. దాదాపు 60.5శాతం మంది రెండో తరగతి చదివే విద్యార్థులు మరో తరగతి విద్యార్థులతో కలిసి కూర్చుంటున్నారు. 2010 నుంచే ఇలా ఒక తరగతికి చెందిన విద్యార్థులు మరో తరగతి విద్యార్థులతో కలిసి ఒకే గదిలో కూర్చుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని 259 ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయాలు బయటకు వచ్చాయి.

 మెరుగైన సౌకర్యాల గురించి మాట్లాడితే...

మెరుగైన సౌకర్యాల గురించి మాట్లాడితే...


విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉందని హైదరాబాదుకు చెందిన ఓ టీచర్ చెప్పారు. అలాంటప్పుడు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడి అజెండాను తయారు చేయాలని ఆమె కోరారు. ఇలా చేయడం ద్వారా విద్యకున్న ప్రమాణాలు మెరుగుపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ప్రమాణాలు అత్యంత పేలవమైన పరిస్థితుల్లో ఉండటం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మరియు బీహార్‌లో ఎక్కువగా కనిపిస్తాయిని ఆమె పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాణాల గురించి మాట్లాడితే ఏకంగా స్కూలునే మూయించే స్థితికి అధికారులు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూలుకు నిధులు ఇచ్చి బాగుచేయాల్సింది పోయి పాఠశాలనే మూసేస్తే లాభం ఏముంటుందని ప్రశ్నించారు.

2009 విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది..?

2009 విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది..?

ఇక పాఠశాలల్లో విద్యార్థులకు సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని రాష్ట్ర వార్షిక విద్యా రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ప్రతి పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన సురక్షితమైన తాగునీరును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం చెబుతోంది. అంతేకాదు అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరు మరుగుదొడ్లు ఉండాలని చట్టంలో పొందుపర్చడం జరిగింది. అయితే తెలంగాణలోని పాఠశాలల్లో మాత్రం ఇలాంటివేమీ కనిపించడం లేదని నివేదిక పేర్కొంది.

 విద్యార్థులకు లేని తాగునీటి వసతి

విద్యార్థులకు లేని తాగునీటి వసతి

2018 నాటికి 42.8శాతం తెలంగాణలోని స్కూళ్లకు తాగునీటి వసతి లేదని నివేదిక తెలపింది. ఏళ్లు గడిచే కొద్దీ చాలా స్కూళ్లలో సురక్షితమైన తాగు నీరు కొరత కనపడిందని సర్వే వెల్లడించింది. నవంబర్ నెలలో విద్యార్థులు మంచి నీరు తాగాలని చెబుతూ వాటర్ బెల్‌‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తెలంగాణ స్కూళ్లల్లో టాయ్‌లెట్ల వినియోగం పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2010లో 38.6శాతం మాత్రమే టాయ్‌లెట్స్‌ను వినియోగిస్తుండగా 2018 నాటికి అది 77శాతంకు చేరుకుందని లెక్కలు వివరిస్తున్నాయి. ఆడపిల్లలకు సెపరేట్ టాయ్‌లెట్స్ నిర్మాణం కూడా పెరిగిందని సర్వే స్పష్టం చేసింది.

English summary
Around half of the primary schools students in Telangana do not sit in separate classes, according to the Annual State of Education Report (2018)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X