హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ మారాల్సిన సమయం వస్తే ఎవ్వరు ఆపలేరు : డీఎస్

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డీఎస్ కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అమిత్ షాను కలవడంపై ఆయన వివరణ ఇచ్చారు. ప్రజాస్వామ్య వవస్థలో సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఎవరినైన కలువ వచ్చనే వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను తాను ప్రత్యేకంగా కలువలేదని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగానే అమిత్ షాను కలిశానని వివరించారు.

మరోవైపు తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరాల్సిన సమయం వస్తే ఎవ్వరు ఆపినా, ఆగదని అన్నారు. కాగా తనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఏడాదిన్నర గడుస్తుందని చెప్పిన డీఎస్ ఇప్పటి వరకు పార్టీ స్పందించ లేదని అన్నారు. ఇకముందు కూడ స్పందిస్తుందని కూడ అనుకోవడం లేదని చెప్పారు. ఇక హుజురునగర్‌ ఉప ఎన్నికపై కూడ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో డిఫరెంట్ రాజకీయం నడుస్తోందని అన్నారు. అయితే ప్రజలు కూడ ఎప్పుడు ఎలా తీర్పు ఇస్తారో చేప్పలేమని అన్నారు.

No one can stop if i would change the party : D.srirnivas

కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్న డీఎస్.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ప్రచారానికి అనుగుణంగానే ఆయన అమిత్‌షాను కలిశారు. అంతకుముందు పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆహ్వానం లేకున్నా హజరై అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. మరోవైపు ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ ఎంపీగా గెలవడంలో డీఎస్ పాత్ర ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అటు టీఎర్ఎస్‌లో పూర్తిస్థాయిలో ఉండలేక ఇటు బీజేపీలోకి వెళ్లలేక డీఎస్ తటస్థంగా వ్వవహరిస్తున్నారు. దీంతో ఆయన పార్టీలో చేరే సమయం వస్తే ఎవ్వరు ఆపినా ఆగే ప్రసక్తే లేదంటూ కూడ అసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్టీ మార్పుపై మరోసారి ఆసక్తి నెలకొంది.

English summary
The TRS Rajya Sabha MP D.srinivas had cleard about meeting with BJP national president amit shah. he rebutted the rumours of party change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X