హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీర్ రోడ్ షో ప్రజలే లేరు... పోన్నం

|
Google Oneindia TeluguNews

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ నిర్వహించిన రోడ్ షో‌కు ప్రజలే లేరని మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నదంతా హంగు ఆర్బాటాలే తప్ప అభివృద్ది ఎక్కడా జరగలేదని ఆయన విమర్శించారు. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నేరవేర్చలేదని.. మండిపడ్డారు. గత హమీలు నెరవేర్చని కేటీఆర్ ఇప్పుడు ఏమోహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని పోన్నం ప్రశ్నించారు.ఇక హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని అన్నారు. ఒకవేళ అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రం అప్పులు రెట్టింపు అవుతాయని హెచ్చరించారు.

మరోవైపు కేసిఆర్ నియతృత్వ ధోరణి వల్లే ఆర్టీసీ కార్మీకులు సమ్మెను కొనసాగిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను వాడుకుని ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలనే దురుద్దేశ్యంతో సీఎం కేసిఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు.

No public in ktr road show at huzurnagar ;ponnam prabhakar

అందుకే ఆర్టీసీని నష్టాల్లో ఉందంటూ దుష్ప్రచారం చేసి, ఆర్టీసీ వ్యవస్థను నర్వీర్యం చేయాలనే యోచనలో సీఎం ఉన్నారని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారే లేకుండా ప్రతిపక్షాల గోంతులు నొక్కుతున్నారని అన్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం కాకుండా చూస్తామని అన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధంగా తెలంగాణలో కూడ ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయాలని డిమాండ్ చేశారు.

English summary
There was no public in ktr road show in huzurnagar by-elections said ex mp ponnam prabhakar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X