హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ డెడ్ లైన్ కు స్పందన లేనట్టే .. రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరిన ఆర్టీసీ ఉద్యోగులు 360

|
Google Oneindia TeluguNews

తెలంగాణా సీఎం కేసీఆర్ జారీ చేసిన అల్టిమేటానికి ఆర్టీసీ కార్మికుల నుండి పెద్దగా స్పందన రాలేదు. కేవలం 254 మంది మాత్రమే విధుల్లో చేరారని మిగతా వారంతా పోరుబాతలోనే సాగానున్నారని తాజా లెక్కలు చెప్తున్నాయి. కేసీఆర్ చేసిన అల్టిమేటం కార్మికుల్లో బాగా పని చేస్తుంది అనుకుంటే అది పెద్దగా పని చెయ్యలేదు అని నిన్న అర్దరాత్రి వరకు జరిగిన చేరికలు చెప్పాయి.

 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరకుంటే ప్రైవేట్ పరం చేస్తామని కేసీఆర్ హెచ్చరిక

5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరకుంటే ప్రైవేట్ పరం చేస్తామని కేసీఆర్ హెచ్చరిక

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు అల్లిమేటం జారీ చేశాడు. మరొక అవకాశం ఇస్తున్నాను అని చెపుతూ 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పరిగణిస్తామని, వారికి రక్షణ సైతం కల్పిస్తామని, ఎవరికి భయపడకుండా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరాలని చెప్పారు. లేకుంటే ఇప్పటికే ఐదు వేలు బస్సులను ప్రైవేటు ట్రావెల్స్ కు అప్పగించామని, మిగతా ఐదు వేల బస్సులను సైతం ప్రైవేటు ట్రావెల్స్ కు అప్పగించడానికి వెనకడుగు వేయమని క్లియర్ కట్ గా కుండబద్దలు కొట్టారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన జేఏసీ ... సర్వత్రా టెన్షన్

ఆగ్రహం వ్యక్తం చేసిన జేఏసీ ... సర్వత్రా టెన్షన్

దీంతో ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలతో బెదిరింపులకు గురి చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మెబాట వీడేది లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ 5వ తేదీ అర్ధరాత్రి వరకు డెడ్ లైన్ పెట్టడంతో ఎంత మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరతారన్న ఉత్కంఠ ఆర్టీసీ కార్మిక జెఎసి నాయకులలో సైతం నెలకొంది.

కేసీఆర్ చేసిన అల్టిమేటానికి స్పందన కరువే

కేసీఆర్ చేసిన అల్టిమేటానికి స్పందన కరువే

ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ డెడ్ లైన్ పెట్టిన అదరలేదు బెదరలేదు. దాదాపు 49,733 మంది ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తుండగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ కు ఓకే చెప్పింది కేవలం 360 మంది కార్మికులు మాత్రమే. తెలంగాణలో నెలరోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నిన్న అర్థరాత్రితో కీలక మలుపు తీసుకోబోతోంది అని చాలామంది భావించారు. సీఎం కేసీఆర్ ఎక్కడ తగ్గకపోవడంతో, ఆర్టీసీ కార్మికులు తగ్గి తిరిగి విధుల్లో చేరుతారని అనుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 360 మంది కార్మికులు, ఆఫీసు సిబ్బంది మాత్రమే చేరిక

రాష్ట్ర వ్యాప్తంగా 360 మంది కార్మికులు, ఆఫీసు సిబ్బంది మాత్రమే చేరిక

కార్మికులు సమ్మెపై వెనక్కి తగ్గితే ఆర్టీసీ నిలబడుతుంది.. తగ్గకపోతే ఆర్టీసీ మొత్తం కనుమరుగై ప్రైవేటీకరణ అవుతుంది అన్న భయాన్ని సీఎం కేసీఆర్ కల్పించినప్పటికీ కార్మికులు మాత్రం పోరుబాట నేర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 360 మంది కార్మికులు, ఆఫీసు సిబ్బంది మాత్రమే విధుల్లో చేరారు అంటే కార్మికుల ఉద్యమ స్ఫూర్తి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి వరకు విధుల్లో చేరిన 360 మంది కార్మికులు మినహాయించి మిగతా కార్మికులు ఎవరు సీఎం కేసీఆర్ నిర్ణయానికి భయపడటం లేదు.

కార్మిక మరణాలే కార్మికులను పోరుబాట వీడకుండా చేశాయి

కార్మిక మరణాలే కార్మికులను పోరుబాట వీడకుండా చేశాయి

కార్మికులు పట్టు వదల్లేదు.. పోరాటం నుంచి వైదొలగలేదు. ఇప్పటికే ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న, గుండెపోటుతో మృతి చెందిన పట్టించుకోని తెలంగాణ సర్కార్ వైఖరిపై కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా కనీసం జాలి చూపించకుండా ఉద్యోగాలు పోతాయని, కుటుంబాలు రోడ్డున పడతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించడం ఆర్టీసీ కార్మికులను ఆవేదనకు గురి చేస్తుంది. అందుకే తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న కార్మికులు ఉద్యమబాట వీడలేదు.

 విధుల్లో చేరింది 160 మంది కార్మికులు, 200 మంది మినిస్టీరియల్‌ సిబ్బంది

విధుల్లో చేరింది 160 మంది కార్మికులు, 200 మంది మినిస్టీరియల్‌ సిబ్బంది

ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసిన, కార్మిక సంఘ నాయకులకు కార్మికులకు మధ్యలో అగాధం సృష్టించాలని ఎంత ప్రయత్నం చేసినా అన్నింటికీ తెగించి అసాధారణ ఐక్యతను, సమష్టి ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు కార్మికులు . ఉద్యోగాల్లో చేరేందుకు చివరి అవకాశమంటూ సీఎం చెప్పిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అయినారాత్రి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 160 మంది మాత్రమే విధుల్లో చేరారు. అయితే బస్‌భవన్‌లో మినిస్టీరియల్‌ సిబ్బంది దాదాపు మరో 100 మంద వరకు చేరారని అధికారవర్గాల లెక్కలు చెబుతున్నాయి. అంతా కలుపుకొంటే 360 మంది మాత్రమే విధుల్లో చేరినట్లవుతుంది.

మొత్తం ఉద్యోగుల్లో చేరిక 0.50 శాతం మాత్రమే

మొత్తం ఉద్యోగుల్లో చేరిక 0.50 శాతం మాత్రమే

మొత్తం ఉద్యోగుల్లో ఇది సుమారు 0.50 శాతం మాత్రమే కావడం సీఎం కేసీఆర్ ఇచ్చిన అల్టిమేటం కు కార్మికులు భయపడి లేదనే విషయాన్ని తేల్చి చెపుతుంది. నెల రోజులుగా సాగుతున్న సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా 49,733 మంది కార్మికులు పోరుబాట పట్టారు. ఎంతో మంది కార్మికులు ప్రాణాలు వదిలారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ తాను తీసుకున్న నిర్ణయానికి తలవంచి కార్మికులు పని చేయాలని చెప్పడం, ఇంకా చెప్పాలంటే విధులలో చేరకుంటే బస్సులన్నీ ప్రైవేటుపరం చేస్తామని బెదిరించడం కార్మిక లోకానికి ఏమాత్రం నచ్చలేదు.

 రాష్ట్ర వ్యాప్తంగా డెడ్ లైన్ లోపు విధుల్లో చేరింది వీరే

రాష్ట్ర వ్యాప్తంగా డెడ్ లైన్ లోపు విధుల్లో చేరింది వీరే


రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ సమయానికి విధుల్లో చేరిన కార్మికుల లెక్క చూస్తే ఉమ్మడి జిల్లాల వారీగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు విధుల్లో చేరిన కార్మికులు. వరంగల్‌-15, రంగారెడ్డి-19, కరీంనగర్‌- 22, మెదక్‌-16, నిజామాబాద్‌-7, ఖమ్మం-12, నల్లగొండ-5, అదిలాబాద్‌-12, మహబూబ్‌నగర్‌-12, గ్రేటర్‌ హైదరాబాద్‌-25, వీరు కాక బస్ భవన్ లో మినిస్టీరియల్ సిబ్బంది 200మంది వరకు చేరారని తెలుస్తుంది.

English summary
Thousands of striking Telangana State Road Transport Corporation (TSRTC) employees refused to return to work and vowed to intensify their protest even as the deadline set by Chief Minister K Chandrasekhar Rao expired on Monday midnight. that over 40,000 employees would not join work unless the government holds discussion with them on their demands. Only 245 workers and ministerial employees joined in the duties .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X