హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక కేబీఆర్ పార్క్ లో ఉరుకుడు బంద్..! ఓన్లీ వాకింగ్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఇక న‌గ‌ర యువ‌త‌కు ఎంతో ఇష్ట‌మైన కేబీఆర్ పార్క్ లో ప‌రుగులు తీయాల‌నుకుంటే కుద‌ర‌దు. ప‌రుగులు తీసి కొవ్వు క‌రించుకోవాల‌న్నా, జాగింగ్ చేసి బాడీని ఫిట్ గా ఉంచుకోవాల‌నుకున్నా అది ఇక కేబీఆర్ పార్క్ లో కుద‌ర‌ని ప‌ని. కేవ‌లం వాకింగ్ చేస్తానంటేనే కేబీఆర్ పార్క్ లోకి అనుమ‌తి ఇస్తారు నిర్వాహ‌కులు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని కేబీఆర్‌ పార్కును కేవలం వాకింగ్‌కు మాత్రమే వినియోగించుకోవాలని, ఇక్కడ రన్నింగ్, జాగింగ్‌ చేయరాదంటూ జిల్లా అటవీ శాఖాధికారి ఉత్తర్వు జారీ చేశారు. ఈ మేరకు పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నోటీసు బోర్డులో రన్నింగ్, జాగింగ్‌ను నిషేధించినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 3వేల మందికి పైగా, సాయంత్రం 1500 మందికి పైగా వాకర్లు పార్కులో వాకింగ్‌ చేస్తుంటారు.

ఇటీవల కాలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ట్రైనర్లుగా నియమించుకొని పార్కులో రన్నింగ్, జాగింగ్‌ చేస్తున్నారు. దీంతో అసలే ఇరుగ్గా ఉండే వాకింగ్‌ ట్రాక్‌పై వాకర్లకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌ పార్కులో వెయ్యి మందికి పైగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేస్తుంటారు.

 no running and jogging in KBR Park..! only walking..!!

వేగంగా పరుగెత్తుకొస్తున్న వారితో వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొన్నిసార్లు పరుగెత్తుకొస్తున్న వారు పొరపాటున వీరికి తగులుతుండడంతో కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్‌ సిటిజన్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాగింగ్, రన్నింగ్‌ను అధికారులు నిషేధించారు. దీంతో ర‌న్నింగ్ చేయానుకున‌న్న యువ‌తీ యువ‌కుల‌కు తీవ్ర నిరాశ ఎదురౌతోంది.

English summary
The District Forest Officer has issued a notification that the KBR Park in Banjara Hills Road No. 2 should be used only for Walking, not running and jogging. Running and jogging were banned in the notice board set up on the park premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X