• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ట్రాఫిక్‌ నియంత్రణ వ‌ద్దు..! చ‌లాన్లే ముద్దు..! న‌గ‌ర ట్రాఫిక్ పోలీసులు వింత క‌క్కుర్తి...!!

|

హైద‌రాబాద్ : విశ్వ‌న‌గ‌రం దిశ‌గా అడుగులు వేస్తున్నాం అని చెప్పుకొస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ట్రాఫిక్ పోలీసుల వ్య‌వ‌హారం శ‌రాఘాతంగా ప‌రిణ‌మించింది. న‌గ‌రానికి కొత్త‌గా వ‌చ్చిన వారు మొద‌ట చూసేది ఆకాశం వైపు మ‌రొక‌టి ట్రాఫిక్ వైపు. ఆకాశం నిర్మ‌లంగా ఉంటే కాలూష్యం లేని న‌గ‌రంగా నిర్ధార‌ణ అవుతుంది., ట్రాఫిక్ సాఫీగా కొన‌సాగుతుంటే వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ప‌నిచేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతుంది. కాని అడుగ‌డుగునా ట్రాఫిక్ స‌మ‌స్య ఎదురౌతూ, నిత్యం ట్రాఫిక్ లో స‌మ‌యం వ్రుధా అవుతుంటే దాని ప్ర‌భావం క్రుత‌నిశ్చ‌యంతో ప‌నిచేసే ప్ర‌భుత్వాల‌పై తీవ్రంగా ప‌డుతుంది. సున్నిత‌మైన అంశం పట్ల ట్రాఫిక్ పోలీసులు అల‌సత్వం వ‌హిస్తుండ‌డంతో అస‌లు స‌మ‌స్య మొద‌లౌతోంది. అలా కాకుండా విధి నిర‌హ‌ణ‌లో స‌క్ర‌మంగా క‌ర్తవ్యం నిర్వ‌హిస్తే న‌గ‌రంలో ఎలాంటి ట్రాఫిక్ స‌మ‌స్య‌కు ఆస్కారం ఉండ‌దు. న‌గ‌ర ట్రాఫిక్ వ్య‌వ‌స్థ తీరుతెన్నుల‌నై వ‌న్ ఇండియా ప్ర‌త్యేక క‌థ‌నం..!!

చలాన్లకే పరిమితమైన పోలీసులు..! గాలికొదిలేస్తున్న ట్రాఫిక్ నియంత్ర‌ణ..!

చలాన్లకే పరిమితమైన పోలీసులు..! గాలికొదిలేస్తున్న ట్రాఫిక్ నియంత్ర‌ణ..!

ట్రాఫిక్‌ పోలీసులు నిరంతరం దుమ్ము, దూళిలో పనిచేస్తూ ఉంటారని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వారి శ్రమను గుర్తించి ట్రాఫిక్‌ పోలీసులకు మిగతా పోలీసులతో పోల్చుకుంటే అదనంగా 30 శాతం జీతం అందిస్తుంది. వారి పని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ట్రాఫిక్‌ పోలీసులు అంటే సిగల్స్‌, చౌరస్తాల వద్ద సిబ్బంది విధులు నిర్వహించేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ట్రాఫిక్‌ విధుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో చలాన్లు విధించడమే టార్గెటా..? ట‌్రాఫిక్ పోలీసుల వింత బాగోతం..!!

డ్రంకెన్‌ డ్రైవ్‌లో చలాన్లు విధించడమే టార్గెటా..? ట‌్రాఫిక్ పోలీసుల వింత బాగోతం..!!

నిత్యం డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు, వాహనాల తనిఖీలు, చలాన్లు విధించడం, నో ఎంట్రీ వాహనాలను పట్టుకోవడం మాత్రమే చేస్తూ తమ డ్యూటీ అనుకొని కాలం వెల్లబుచ్చుతున్నారు. కానీ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిం చాలనే ఇంగిత జ్ఞానం లేకుండా రద్దీగా ఉన్నా ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ముందుకు రావడం లేదనేది ఎక్క‌డ చూసినా సాక్షాత్క‌రిస్తుంటుంది. ఒకవేళ ట్రాఫిక్‌ నియంత్రించడానికి హోంగార్డు నుంచి మొదలుకొని ఏఎస్‌ ఐల వరకు ట్రాఫిక్‌ నియంత్రణ చేసే సమయంలో అక్కడ ఉంటే వారిపై కొందరూ మందుబాబులు, మరికొందరు వాహన దారులు తిరగబడుతుండ‌డం కూడా చూస్తుంటాం.

చ‌ట్టాలను క‌ఠినంగా అమ‌లు చేయాలి..! ట్రాఫిక్ సిబ్బంది పై దాడుల‌ను నియంత్రించాలి..!!

చ‌ట్టాలను క‌ఠినంగా అమ‌లు చేయాలి..! ట్రాఫిక్ సిబ్బంది పై దాడుల‌ను నియంత్రించాలి..!!

ట్రాఫిక్‌ సిబ్బం దిపై మద్యం ప్రియులు త‌రుచుగా తిరగబడటంతో ఉన్నతాధికారులకు లేని పట్టింపు తమకెందుక‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు పోలీసులు. వచ్చామా, విధులు నిర్వహించామా, ఇంటికి వెళ్లామా అన్నట్టుగా ట్రాఫిక్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ ఉన్నతాధి కారులు మాత్రం కేవలం కార్యాలయాల్లోనే కాలం వెళ్ల‌దీస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్‌ ఎస్ఐలు, సీఐలు మాత్రమే చలాన్లు విధించే పనిలో ఉంటున్నారు. ఆపై ట్రాఫిక్‌ అధికారులు మాత్రం ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు దాటితే మద్యం షాపులు, బార్‌షాపులు, షాపింగ్‌మాల్స్‌, రెస్టారెంట్‌ల వద్ద సర్వీస్‌ రోడ్డు ను ఆక్రమించుకొని రోడ్లపైనే వాహనాలు నిలిపి వారి పనులను ఏంచక్క కానిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

రెండు గంట‌లు ఖ‌చ్చితంగా డ్యూటీ చేస్తే ఎక్క‌డా ట్రాఫిక్ స‌మ‌స్య ఉండ‌దు..! కాని అలా చేయ‌రుగా..!!

రెండు గంట‌లు ఖ‌చ్చితంగా డ్యూటీ చేస్తే ఎక్క‌డా ట్రాఫిక్ స‌మ‌స్య ఉండ‌దు..! కాని అలా చేయ‌రుగా..!!

శని, ఆది వారాలలో రెస్టారెంట్‌లు, షాపింగ్‌ మాల్స్‌ల ఎదుట వాహనాలు ఎక్కువ కావడంతో ఆప్రాంతాల గుండా ప్రయాణించాలంటే 5 నిమిషాల ప్రయాణానికి 30 నిమి షాలు సమయం తీసుకుంటుంది. వారాంతపు సంతల్లో కూడ ట్రాఫిక్‌ నియంత్రించే ట్రాఫిక్‌ పోలీసులు చూద్దామన్న కానరారు. ఆదివారం పూట స‌ర‌ద‌గా కుటుంబంతో బ‌య‌ట‌కు వెళ్దామ‌ని బైక్ పై బ‌య‌ల్దేరిని వారికి చుక్కులు క‌నిపిస్తుంటాయి.

క‌నుచూపు మేర‌లో ట్రాఫిక్ ను
నియంత్రించే పోలీసులు క‌నిపించ‌క‌వోడంతో న‌గ‌ర ప్ర‌జ‌లు విసుక్కునే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చాక జీతాలు భారీగా పెంచ‌డంతో పాటు స‌మ‌యాన్ని కూడా కుదించింది. ఐన‌ప్ప‌టికి ట్రాఫిక్ పోలీసుల తీరు లో మార్పు రాక‌పోవ‌డంతో న‌గ‌ర ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల‌కు గురికాక త‌ప్ప‌డం లేదు.

English summary
Every time a traffic problem occurs, Get traffic in sight As the police were unable to control, the city's people were in a state of trouble. After the Telangana government, salaries have been greatly increased and time has been reduced. However, the traffic of the police has not changed in the face of a lot of trouble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X