హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్ద దావాఖానాల్లో నీళ్లు లేవ్..! యధేఛ్చగా నీటి దందా..! చోద్యం చూస్తున్న అదికారులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హాస్పటల్ అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. దవాఖానా లో చరిన తమ వారు ఆరోగ్యంతో ఇంటికి వస్తే చాలనుకుంటారు చాలా మంది. రాని ఆసుపత్రుల్లో సదుపాయాలు అరకొరగా ఉంటే చిర్రెత్తుకొస్తుంది. ఇక అన్నిటికి అవసరమయ్యే నీళ్లు లేక పోతే మరింత విరక్తి కలుగుతుంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ దవాఖానాల్లో రోగులు, వారిబంధువులు నీళ్ల కోసం అలమటిస్తున్నారు. తాగనీకి నీళ్లు లేక బాటిళ్లుపట్టు కుని లోపలికి, బయటకు చక్కర్లు కొడుతున్నారు. ఎక్కడా వాటర్‌ కూలర్లు పెట్టకపోవడం, ఉన్నవి పనిచేయకపోవడంతో స్వచ్ఛంద సంస్థల దయతో నీటిని పట్టుకుని తాగాల్సి వస్తోంది. మరి కొంతమంది హాస్పిటల్స్‌‌ ఆవరణలో ఉన్న షాపుల్లో డబ్బులు పెట్టి బాటిల్స్‌‌ కొనుక్కొంటున్నారు.

 నగరంలో పేరుగాంచిన దవాఖానలు..! నీళ్లు లేక అలమటిస్తున్న పేషెంట్లు..!!

నగరంలో పేరుగాంచిన దవాఖానలు..! నీళ్లు లేక అలమటిస్తున్న పేషెంట్లు..!!

నగరంలోని పెద్దాస్పత్రుల్లోని నీటి కష్టాలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. మండుటెండలో గుక్కెడు నీటి కోసం పేషెంట్లు , వారి బంధువులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. గొంతు తడుపుకోవాలంటే తాగునీరు దొరకని పరిస్థితి. గాంధీ, నిలోఫర్ హాస్పి టల్స్ లోని రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఉస్మానియా వంటి హాస్పిటల్ లోనూ స్వచ్ఛంద సంస్థలే గొంతు తడుపుతున్నాయి. మెరుగైన వైద్యం సంగతేమో గానీ తాగేందుకు నీళ్లు ఇప్పించండి బాబోయ్ అంటూ పేషెంట్లు , వారి బంధువులు వేడుకుంటున్నారు . బాటిల్ వాటర్ కోసం హాస్పిటల్ మొత్తం తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఇతరప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లు నీళ్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నారు .

సుధీర్గ చరిత్ర గల ఉస్మానియా..! చుక్క నీళ్లు లేక చుక్కలు చూస్తున్న రోగులు..!!

సుధీర్గ చరిత్ర గల ఉస్మానియా..! చుక్క నీళ్లు లేక చుక్కలు చూస్తున్న రోగులు..!!

రాష్ట్రం లోనే అతి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా. ఇక్కడికి రోజూ 3 వేల మంది వరకు ఓపీ కోసమేవస్తుంటారు. వెయ్యి మందికి పైగా ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. ఇక పేషెంట్ల అటెండెన్స్, డాక్టర్లు, ఇతర సిబ్బం దితో కలిపి దాదాపు 10వేల మంది వరకు ఉంటారు. సాధారణ రోజుల్లో నీటికి పెద్దగా డిమాండ్ ఉండదు. కానీ ప్రస్తుతం దాహంతీర్చుకునేందు పేషెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు . ఓపీకి వచ్చే వారి కోసం ఓ స్వచ్ఛందసంస్థ నీటిని అందిస్తోంది. అయితే ఓపీ బిల్డింగ్ మొత్తానికి ఈ సంస్థ అందించే నీళ్లే దిక్కయ్యాయి.ఈ భవనంలో ఒక వాటర్ కూలర్ ను ఏర్పాటు చేసినప్పటికీ అది పనిచేయటం లేదు. చికిత్స తీసుకున్న వారంతా స్వచ్ఛంద సంస్థ వారు అందించే నీటి మీదే ఆధారపడుతున్నారు.

నిలోఫర్ లో నీటి దందా..! పట్టించుకోని అదికారులు..!!

నిలోఫర్ లో నీటి దందా..! పట్టించుకోని అదికారులు..!!

నిలోఫర్ హాస్పి టల్ వద్దకు వెళ్తే చాలు జనంవాటర్ బాటిల్స్ తో నీటి కోసం వెతుకుతున్న దృశ్యాలు కంట పడతాయి. రోజులో 1200మందికి పైగా ఓపీ కోసం వస్తుండగా మరోవెయ్యి మంది ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతుంటారు. వీరితో పాటు వచ్చే అటెండెన్స్, హాస్పిటల్ సిబ్బందితో కలుపుకుంటే 5 వేలమందికి ఇక్కడ తాగునీరు అవసరం. సాధారణ రోజుల్లోనే నీలోఫర్ లో నీటి కష్టాలుంటాయి.వేసవి రావటంతో గుక్కెడు నీళ్ల కోసం పేషెంట్లబంధవులు పోటీ పడుతున్నారు.

గాంధీ లోనూ ఇదే సీన్..! కాలకృత్యాలకు నీళ్లు లేక కటకట..!!

గాంధీ లోనూ ఇదే సీన్..! కాలకృత్యాలకు నీళ్లు లేక కటకట..!!

గాంధీ హాస్పి టల్ లో నీటి కష్టాలు పేషెంట్ల కుచుక్కలు చూపిస్తున్నాయి. ఇన్ పేషెంట్లకు చికిత్సఅందించే 8 అంతస్తుల భవనంలో ఎక్కడా ఫ్రిజ్లు అందుబాటులో లేవు. హాస్పి టల్ లో చికిత్సపొందుతున్న వారంతా తాగు నీరు కావాలంటే మార్చురీ పక్కన ఉన్న ట్యాంకర్ వద్దకు రావాల్సిందే. ఒక్కో ఫ్లోర్ లో కనీసం ఒక్క వాటర్ ఫ్రిజ్ కూడా అందుబాటులో లేదు. గాంధీ హాస్పి టల్లో ఓపీ విభాగంతో పాటు ఇన్ పేషెంట్లు , హాస్పిటల్ స్టాఫ్ అంతా కలిసి10 వేల మందికి పైగాఉంటారు. వీరందరికీ సరిపడినంత తాగునీరు అందుబాటులో లేదు. హాస్పి టల్ ఆవరణలో ఉన్నస్వచ్ఛంద సంస్థలు కొంత వరకు నీటి కష్టాలను తీరుస్తున్నాయి. చాలా మంది పేషెంట్ల బంధువులునీళ్ల కోసం సమీపంలోని హోటళ్లు, ఇతర షాప్ల వద్ద కు వెళ్లి కొంటున్నారు . ఇక కాలకృత్యాలుతీర్చుకోవటానికి కావాల్సినంత నీరు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
In Osmania, Gandhi and Nilofar Hospitals, patients and their relatives are looking for water. The drinking water or bottles are much expencive inside and out of the hospitals. With no water coolers being put on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X