హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో లేని మహిళా కమిషన్..ప్రియాంకా రెడ్డి హత్యతో చర్చ

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య పలు ప్రశ్నలకు తావిస్తోంది. నలుగురు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారంకు పాల్పడి ఆపై కిరోసిన్ పోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. మాదాపూర్‌కు వెళ్లి వస్తానని చెప్పి తన స్కూటీపై ఇంటినుంచి బయలుదేరిన తమ కుమార్తె కానరానిలోకాలకు వెళ్లిపోయిందని చెబుతూ ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఈ సమయంలోనే రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలు ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే ప్రియాంకా రెడ్డి ఇంత దారుణంగా హత్యకు గురైతే.. ఇప్పటి వరకు సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కానీ ప్రజాసంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఎలాంటి స్పందన తెలియచేయలేదు. ఇక అంతకంటే దారుణమైన అంశం తెలంగాణలో మహిళా కమిషన్ లేకపోవడం పెద్ద చర్చకు దారి తీస్తోంది.

లవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరులవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరు

తెలంగాణలో లేని మహిళా కమిషన్

తెలంగాణలో లేని మహిళా కమిషన్


డాక్టర్ ప్రియాంకా రెడ్డి దారుణ హత్యతో ఒక కొత్త అంశం తెరమీదకు వచ్చింది. తెరమీదకు రావడమేకాదు పెద్ద చర్చకు కూడా దారితీస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇక్కడ మహిళా కమిషన్ లేకపోవడం ఆలోచింపజేస్తోంది. మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు జరిగినప్పుడు మహిళా కమిషన్ స్పందించాలి. మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ మహిళా కమిషన్ లేకపోవడంతో డాక్టర్ ప్రియాంకా రెడ్డికి నిజంగా న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక తెలంగాణలో గత ఆరేళ్లుగా మహిళా కమిషన్ లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించకపోవడంపై పలు విమర్శలు వచ్చిన విషయాన్ని మేధావులు గుర్తుచేస్తున్నారు. తొలి విడత ప్రభుత్వంలో మహిళా మంత్రులు లేకుండానే ప్రభుత్వం సాగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 మహిళా కమిషన్‌ అధికారాలు వేరు

మహిళా కమిషన్‌ అధికారాలు వేరు

కేసీఆర్ సర్కార్ రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. ఇప్పటికీ మహిళా కమిషన్ ఏర్పాటు కాలేదు. మహిళలకు ఏదైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించేందుకు మహిళా కమిషన్‌ను బాధిత మహిళలు ఆశ్రయిస్తారు. ఒకవేళ ఉన్నప్పటికీ దాన్ని ఆరోవేలు కిందే లెక్కగట్టాల్సి ఉంది. మహిళా కమిషన్‌కు చట్టపరంగా ఉన్న అధికారాలు వేరు. మహిళలకు న్యాయం జరగని పక్షంలో మహిళా కమిషన్‌లు బాధితులకు అండగా నిలుస్తాయి. అంతేకాదు బాధితులకు అన్ని విధాలా సాయం అందేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసే హక్కు కలిగి ఉంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంకా రెడ్డి హత్యను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. రాష్ట్రంలో మహిళా కమిషన్ లేకపోవడంతో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది.

 మహిళల రక్షణ కోసం ఏం చేయాలి..?

మహిళల రక్షణ కోసం ఏం చేయాలి..?

మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లను ఏర్పాటు చేసినప్పటికీ ఈ టీమ్స్‌ను శివారు ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. మహిళలు ఆపదలో ఉంటే ఫిర్యాదు చేసేందుకు ఎమర్జెన్సీ నెంబర్లు ఉన్నప్పటికీ... అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫోన్లు మార్కెట్‌లోకి విడుదల అవుతున్న సమయంలోనే కొన్ని ఎమర్జెన్సీ నెంబర్లను ముందుగానే లోడ్ చేసి ఉంచితే బాగుంటుందన్న అభిప్రాయం పౌరులు వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారం చేస్తే ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తుందా అనే రీతిలో పాలనా పరంగా చట్టపరమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవశ్యకత ఉంది.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
 ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తుందా..?

ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తుందా..?

ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత రెండు రోజుల హడావుడి చేసేసి ఆ తర్వాత కేసునే పక్కకు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే నిందితులను పట్టుకుని శిక్ష విధించి ఆతర్వాత బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం దగ్గరుండి చూసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కాని పక్షంలో లేదా ప్రభుత్వంలోని ప్రముఖలను సంప్రదించనలేని సమయంలో మహిళా కమిషన్ ఉండాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా కమిషన్ ఉంటే భరోసా ఉంటుంది కనుక తప్పక న్యాయం జరుగుతుందనే అభిప్రాయం పౌరులు, మహిళలు వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకా రెడ్డి ఉదంతంతోనైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి ఒక వ్యక్తిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

English summary
With Rape and brutal murder of Dr. Priyanka reddy, questions are raised on government as Telangana state do not have a Woman commission. None had been appointed as woman commission chairperson by KCR govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X