హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఒవైసీ విచారణకు హాజరు కాలేదు. దీంతో స్పెషల్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కోర్టుకు హాజరుకాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంటారు.

2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో దాడి జరిగింది. హైదరాబాద్ మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో కాంగ్రెస్‌ షబ్బీర్‌ అలీ కారులో వెళ్తుండగా కొందరు అడ్డగించారు. కారులో ఉన్న షబ్బీర్‌ అలీపై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ ఐదేళ్లుగా ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది. అయితే వాయిదాకు అసదుద్దీన్ ఒవైసీ డుమ్మా కొట్టడంతో.. నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేశారు.

non bailable warrant issue against asaduddin owaisi

Recommended Video

PM Modi to Visit Hyderabad దమ్ముంటే పాతబస్తీకి రావాలంటూ ప్రధాని మోడీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్..!!

ఇదే కాదు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారిడిపై కూడా అసదుద్దీన్ ఒవైసీ అండ్ కో దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు కూడా విచారణ జరుగుతోంది. దీనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమీ జారీ కాలేదు. పాతబస్తీలో ఎంఐఎం హవా కొనసాగుతోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలకు అంత ప్రాధాన్యం ఉండదు. ఒకవేళ వెళ్లినా.. లెక్కచేయరు. అలాంటి సందర్భంలోనే దాడి జరిగింది. దీనిపై షబ్బీర్ అలీ కేసు పెట్టారు. వాయిదాకు అసదుద్దీన్ హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేశారు. ఎంఐఎంకు అధికార టీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

English summary
non bailable warrant issue against mim chief asaduddin owaisi for congress leader shabbir ali attack case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X