హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ వర్సెస్ ఉత్తమ్: పీసీసీ పదవీపై ప్రచారం, రాష్ట్రంలో న్యూసెన్స్: జగ్గారెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మార్పు ఊహాగానాల నేపథ్యంలో రాజకీయాలు రంజుగా మారాయి. కాంగ్రెస్ మార్క్ పొలిటిక్స్ జరుగుతోన్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి అనుకూల వర్గాలుగా ఏర్పడి కామెంట్లు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మార్పు జరుగుతోందని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. కొత్త సారథి రేవంత్ రెడ్డి అని అతని మద్దతుదారులు ప్రచారం చేసుకొంటున్నారు. దీనిని ఉత్తమ్ వర్గం కూడా ఖండిస్తోంది.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైరయ్యారు. పీసీసీ మార్పు గురించి ప్రచారం చేస్తున్నాని మండిపడ్డారు. వాస్తవానికి పీసీసీ మార్పు గురించి ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియదు గానీ.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం న్యూసెన్స్ జరుగుతోందని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడటం కించపరచడం మంచి పద్ధతి కాదని సూచించారు.

nuisance in telangana state for pcc chief change issue: jagga reddy

Recommended Video

Ranjan Gogoi Took Oath : 'Shame On You' And 'Deal' Sogans By Congress While Walk Out

కాంగ్రెస్ పార్టీలో అందిరినీ కలుపుకొని పనిచేయడం ఆషామాషీ విషయం కాదని జగ్గారెడ్డి అన్నారు. గత ఐదేళ్లుగా పార్టీని నడిపిస్తోన్న ఉత్తమ్ నిజాయితీ గల నాయకుడు అని జగ్గారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. కానీ కొందరు ఉత్తమ్‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ అది అంతిమంగా పార్టీకే నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. పీసీసీ పదవీని ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హైకమాండ్ అప్పజెప్పిందని.. పైరవీ చేయలేదని గుర్తుచేశారు. కానీ కొందరు పదవీ కోసం పాకులాడుతున్నారని జగ్గారెడ్డి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు.

English summary
nuisance in telangana state for pcc chief change issue congress mla jagga reddy alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X