హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లెక్కలతో కుస్తీ.. 3,6,9.. మంత్రివర్గ విస్తరణలో న్యూమరాలజీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జ్యోతిష, వాస్తు శాస్త్రాలను బలంగా నమ్మే సీఎం కేసీఆర్.. న్యూమరాలజీ కూడా ఫాలో అవుతారా? ఆరును అదృష్ట సంఖ్యగా భావించే కేసీఆర్.. మరో రెండు అంకెలను కూడా లక్కీగానే భావిస్తారా? ఇలాంటి ప్రశ్నలకు మంత్రివర్గ విస్తరణ లెక్కలు అవుననే సమాధానమిస్తున్నాయి. తొలి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కలిసొచ్చిన అంకెలనే ఈసారి కూడా ఫాలో అయినట్లు కనిపిస్తోంది.

లెక్కల మంత్రం.. మంత్రుల కొలువు

లెక్కల మంత్రం.. మంత్రుల కొలువు

2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం కేసీఆర్ కొన్ని లెక్కలు పాటించారు. అంకెలు సరిచూసుకున్నాకే మంత్రివర్గం విస్తరించారు. మంత్రివర్గ సహచరుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన కేసీఆర్.. అందుకనుగుణంగానే న్యూమరాలజీ అనుసరించినట్లు స్పష్టమవుతోంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆయనకు 3,6,9 కలిసొచ్చే అంకెలుగా చెబుతుంటారు టీఆర్ఎస్ శ్రేణులు. ఆ క్రమంలోనే అప్పుడు తొలి కేబినెట్ విస్తరణలో 12 మంది ఉండేలా చూసుకున్నారు. 12 అంటే 1+2 =3. ఇదీ లెక్కన్న మాట. కేసీఆర్ కు 3 అదృష్ట సంఖ్య కాబట్టి ఆవిధంగా ఫాలో అయ్యారని టాక్.

అప్పుడు ఇప్పుడు సేమ్

అప్పుడు ఇప్పుడు సేమ్

తొలి ప్రభుత్వంలో అనుసరించిన విధానమే కేసీఆర్ ఈసారి కూడా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో 8 మందిని తీసుకుంటారని, లేదు లేదు 9 మందిని తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ చివరకు కేసీఆర్ తనదైన శైలిలో 10 మందిని ఎంపిక చేశారు. ఈ లెక్కన ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమినిస్టర్ మహమూద్ అలీని కలుపుకుంటే కేబినెట్ సంఖ్య 12కు చేరింది. ఇక్కడ కూడా సేమ్ అదే లెక్క. మొత్తంగా చూసినట్లయితే నెంబర్ 3 టోటల్ గా వస్తుంది.

3,6,9.. అదీ లెక్క మరి

మంత్రివర్గ సహచరుల ఎంపికలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరించారనేది స్పష్టంగా అర్థమవుతోంది. న్యూమరాలజీ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ ఆరో నెంబర్ సంఖ్యను బాగా నమ్ముతారు. ఆయన కాన్వాయ్ వాహనాల నెంబర్లన్నీ కూడా 6666 గా ఉంటాయి. ఇవన్నీ కలిపితే కూడా 6+6+6+6 = 24 అవుతుంది. మళ్లీ ఆ రెండు నెంబర్లు కలిపితే 2+4=6 గా వస్తుంది.

అయితే 3, 9 నెంబర్లను కూడా అదృష్ట సంఖ్యలుగా భావిస్తుండటంతో కేబినెట్ విస్తరణలో మూడుకు కూడా ప్రాధాన్యం ఇస్తారనేది సుస్పష్టం. అదలావుంటే మలివిడతలో మళ్లీ ఆరుగురు మంత్రులను తీసుకునే ఛాన్సుంది కాబట్టి.. అది ఆయన ఫేవరెట్ నెంబరే కదా. అలా మొదటి రెండు విడతల కేబినెట్ విస్తరణలో 3, 6 అంకెలకు ప్రాధాన్యముంటే.. చివరగా టోటల్ మంత్రుల సంఖ్య 18 కాబట్టి అవి కలిపితే 9 అవుతుంది. అలా 3,6,9 కేసీఆర్ కు అచ్చొచ్చిన నెంబర్లనేది ఓ టాక్.

English summary
Jyothish and architects strongly believe the CM KCR .. Numerology will follow? KCR who thinks the number six is ​​lucky? Do you think two more digits are lucky? The answer to these questions is the response of ministerial expansion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X