greater hyderabad ghmc november december Elections notification political parties గ్రేటర్ హైదరాబాద్ నవంబర్ డిసెంబర్ ఎన్నికలు నోటిఫికేషన్ రాజకీయ పార్టీలు Ghmc Elections 2020
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెడీ అవుతున్న యంత్రాంగం .. నోటిఫికేషన్ నవంబర్ లోనే ?
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగాహైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు జాప్యం జరుగుతుంది అని అంతా భావిస్తే అలాంటిదేమీ లేదని ఎన్నికల ఏర్పాట్లలో ఎలక్షన్ కమిషన్ స్పీడ్ పెంచింది . ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల పనుల్లో ఎలక్షన్ కమిషన్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి మొదటి వారంలో జిహెచ్ఎంసి టర్మ్ ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధం అవుతున్నట్టు తాజా సమాచారం .
హైదరాబాద్ వరదలతో 'కారు'కు రివర్స్ గేర్: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు లేనట్టే

నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం
జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించిన తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈనెల 13వ తేదీన తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. దీంతో నవంబర్13 తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

వార్డుల్లో ఎలాంటి మార్పులు లేవని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం
జీహెచ్ఎంసీలో 150 వార్డులు ఉన్నాయి. అయితే మొదటి నుంచి వార్డుల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయని ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. ఇక అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పింది 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయని, ఒక డివిజన్ పరిధిలో యాభై వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రతి కేంద్రంలోనూ వెబ్ క్యాస్టింగ్ , వీడియో రికార్డింగ్ సౌకర్యాలను కల్పించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికతను కూడా ఉపయోగించనున్నట్లు గా సమాచారం.

2021 జనవరి కల్లా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పూర్తి చేయాలని ఎస్ఈసి
2021 జనవరి కల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్న ఎన్నికల కమిషన్ ఆమేరకు దృష్టిసారించింది. రిజర్వేషన్లు విషయానికొస్తే పాత రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని తేల్చింది. దీనికి సంబంధించిన చట్ట సవరణ కూడా ఈ మధ్యనే చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు నవంబరు, డిసెంబరు నెలల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ లో వరదల కారణంగా ఎన్నికలు వాయిదా పడతాయని భావించినా ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎన్నికల నిర్వహణకు దూకుడుగా ముందుకు వెళుతోంది.

స్పీడ్ పెంచిన ఎన్నికల కమీషన్ , రాజకీయ పార్టీలు
రాజకీయ పార్టీలు, ఇటు అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ జిహెచ్ఎంసి ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించడంతో రాజకీయ పార్టీలు స్పీడ్ ను పెంచే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల కోసం పావులు కదుపుతుంటే, ప్రతిపక్ష పార్టీలు సైతం రంగంలోకి దిగుతున్నాయి.