హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయ్యో పాపం.. బీరు బాటిళ్లకు ఎంత నష్టం..! బీరు ప్రియులకు ఎంత కష్టం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అసలే ఎండాకాలం. సాయంత్రం పూట కాస్త చల్ల చల్ల గా బీరు కొడదామంటే షార్టేజ్. ముందే బీర్లకు నగరంలో ఎంతో కొరత. దానికి తోడు నడి రోడ్డు మీద బీర్ల కాటన్లు కిందపడిపోవడం బీరు ప్రియులను ఎంతో నిరుత్సాహానికి గురి చేస్తోంది. అంతే కాకుండా నేడు బేగంపేటలో బీరు కాటన్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్డుపైనే లారీ బోల్తా పడటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే లారీ బోల్తా పడటంతో బీరు సీసాలన్నీ రోడ్డు మీద పడిపోయాయి.

దీంతో వాటిని దొంగలించేందుకు స్థానికులు ఎగబడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీరు సీసాలు చోరీకి గురికాకుండా కాపలా కాస్తున్నారు. అంతే కాకుండా నగరంలోని జీవీకే మాల్ వద్ద సోమవారం ఉదయం ఆయిల్ లీకై బీరు పెట్టెలను తీసుకెలుతున్న లారీ రోడ్డుపై పడిపోయింది. దీంతో అనేక వాహనాలు జారి పడి పలువురికి గాయాలయ్యాయి.

Oh my sin..how much damage to beer bottles.! How difficult it is for beer lovers .. !!

వెంటనే అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్యూ టీం లు చేరుకొని జారిపడి గాయపడ్డవారికి ప్రథమ చికిత్సలు అందించారు.రోడ్డుపై పడ్డ ఆయిల్ పై ఇసుక మన్ను వేసి ప్రయాణికులు ప్రమాద బారిన పడకుండా బారికేడింగ్ చేపట్టారు. జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్యూ బృందాలు సకాలంలో స్పందించి వాహనదారులు ప్రమాదానికి గురవకుండా స్పందించడం పట్ల పలువురు అభినందించారు.

English summary
The lorry is going with beer cotton fell down on the road. The lorry was on the road and the traffic jam on either side of the road became overturned. But lorry was dropped and beer bottles fell off the road. The locals flocked to steal them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X