• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు 'ఓలా' ప‌రిష్కారం..! టీ స‌ర్కార్ తో అవ‌గాహ‌న ఒప్పందం..!!

|

హైదరాబాద్: న‌గ‌ర వాహ‌న దారుల‌కు శుభ‌వార్త‌..! ఇక న‌గ‌ర వాసులు గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. సుల‌భ త‌ర ర‌వాణా వ్య‌వ‌స్థ కోసం ప్ర‌ముఖ ఓలా సంస్థ తెలంగాణ ప్ర‌భుత్వంతో చేతులు క‌లుపుతోంది. న‌గరంలో ట్రాఫిక్ మౌలిక వసతులను పటిష్ఠం చేసే దిశలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచేందుకు గాను, ప్రపంచపు అతిపెద్ద రైడ్ హెయిలింగ్ వేదిక అయిన ఓలా తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం పై సంతకాలు చేసింది. ఇంటెలిజెంట్ ఇన్ సైట్స్ ను షేర్ చేసుకునేందుకు ఈ భాగస్వామ్యం వీలు కల్పిస్తుంది. తద్వారా ఆ సంస్థ‌ నగరంలో ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుపరిచేందుకు, స్మార్ట్ సొల్యూషన్స్ అమలు చేసేందుకు ప్రభుత్వానికి మెళ‌కువ‌లు అందించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.

ఇక న‌గ‌రంలో స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్..! ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకున్న ఓలా..!!

ఇక న‌గ‌రంలో స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్..! ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకున్న ఓలా..!!

తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ముఖ్య కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రవాణా సంబంధిత పాలనా వ్యవహారాలను అండగా నిలిచేందుకు అవసరమైన మొబిలిటీ డేటా, ఉపకరణాల సృష్టికి ఓలా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో మైలురాయిగా నిలువనుంది. మొబిలిటీ డేటా ఉపయోగించడం ద్వారా నగర ఆధారిత రవాణా ప్లానింగ్ మరియు గవర్నెన్స్ కు సపోర్ట్ చేసేందుకు టూల్స్ సృష్టించేందుకు ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్ చే రూపొందించబడిన విస్తృత కార్య క్రమంలోభాగమే ఈ భాగస్వామ్యమ‌ని తెలుస్తోంది.

ఇంటెలిజెంట్ డేటాను పంచుకోనున్న ఓలా..! ప‌రిష్కారం కానున్న ట్రాఫిక్ స‌మ‌స్య‌లు..!!

ఇంటెలిజెంట్ డేటాను పంచుకోనున్న ఓలా..! ప‌రిష్కారం కానున్న ట్రాఫిక్ స‌మ‌స్య‌లు..!!

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ముఖ్య కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ, ‘‘ఒక నగరం అభివృద్ధిలో మొబిలిటీ కీలకపాత్ర పోషి స్తుంది. హైదరాబాద్ కు సమగ్ర స్మార్ట్ సిటీ ప్లాన్ రూపొందించడంపై మేము దృష్టి పెట్టాం. ఓలా అందించే విలువైన డేటా ఇన్ సైట్స్ భవిష్యత్ సన్నద్ధ రవాణా మౌలిక వసతులను ఏర్పరచుకునేందుకు మార్గం సుగమం చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం మరియు ఓలా మధ్య ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ట్రాఫిక్, ట్రాన్స్ పోర్ట్ మేనేజ్ మెంట్ ను సరళీకరించనుంది మరియు మరింత తిరుగులేనివిధంగా ప్రాజెక్టులను ప్లాన్ చేసేందుకు రవాణా అధికారులకు తోడ్పడుతుంది'' అని అన్నారు.

ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు స్మార్ట్ సొల్యూష‌న్స్..! న‌గ‌ర రోడ్ల‌పై ప్ర‌యాణం సుల‌భ‌త‌రం..!!

ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు స్మార్ట్ సొల్యూష‌న్స్..! న‌గ‌ర రోడ్ల‌పై ప్ర‌యాణం సుల‌భ‌త‌రం..!!

ఈ అవగాహన ఒప్పందం కింద అమలు చేయదల్చిన మొదటి పైలట్ ప్రాజెక్ట్ ఓలా ప్లాట్ ఫామ్ పై పని చేస్తున్న వాహనాల నెట్ వర్క్ ద్వారా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రధాన రహదారులపై ప్రయాణ నాణ్యతను డైనమిక్ మ్యాపింగ్ చేయడం. ఆ డేటాను నగరంలో రహదారుల నాణ్యతను పర్యవేక్షించే మరియు నిర్వహించే సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అందించడం జరుగుతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వార వచ్చే ఫలితం గుంతల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు నిర్మాణాల నాణ్యతను పర్యవేక్షించేందుకు మరియు రోడ్డు మరమ్మతుల బడ్జెట్ ప్రాథమ్యాలను నిర్ణయించేందుకు తోడ్పడు తుంది. ఈ భాగస్వామ్యం కింద నగరంలో వినూత్న పరిష్కారాలను అందించేందుకు గాను ఓలా ప్రభుత్వంతో కలసి పని చేయనుంది.

 న‌గ‌ర ట్రాఫిక్ ను మెరుగు ప‌రుస్తాం..! మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తామ‌న్న ఓలా హెడ్..!!

న‌గ‌ర ట్రాఫిక్ ను మెరుగు ప‌రుస్తాం..! మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తామ‌న్న ఓలా హెడ్..!!

ఈ భాగస్వామ్యం గురించి ఓలా రీజనల్ హెడ్ సందీప్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ప్రభుత్వం తో భాగస్వామ్యం మరియు హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ మౌలికవసతులను శక్తివంతం చేసే దిశగా తోడ్పాటును అందించడం మాకెంతో ఆనందదాయకం. గత 6 ఏళ్ళుగా ఓలా, హైదరాబాద్ నగరంలో ఓలా వేదిక పై మిలియన్ల కొద్దీ కిలోమీటర్ల దూరం తిరిగిన కార్లు, ఆటోలు మరియు ద్విచక్రవాహనాల ద్వారా విలువైన సమాచారాన్ని సేకరించింది. తెలంగాణ ప్రభుత్వంతో మా భాగస్వామ్యం ఈ లెర్నింగ్స్ ను ప్రజోపయోగం కోసం ఉపయోగించేకునే దిశలో ఓ ముందడుగు. నగర ట్రాఫిక్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన వివిధ కార్యక్రమాలకు తోడ్పాటు అందించేవిగా మా ప్రయత్నాలు ఉండగలవని మేము విశ్వసిస్తున్నాం'' అని అన్నారు.

English summary
The world's largest ride-in-healing platform, Ola, signed a Memorandum of Understanding with the Government of Telangana in order to support the government's efforts to strengthen the traffic infrastructure in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X