మియాపూర్‌లో కారు బీభత్సం..పాన్‌షాప్‌లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి..
హైదరాబాద్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదం, నిన్న భరత్ నగర్ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదం మరవకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపు తప్పి వాహనాలను ఢీకొట్టింది. పక్కనే ఉన్న పాన్ షాపులోకి దూసుకెళ్లింది.


Hero Rajasekhar Met With A Car Mishap || హీరో రాజశేఖర్ కారు బోల్తా! || Oneindia Telugu
ఈ ప్రమాదంలో పాన్ షాపులో కూర్చున్న అప్జల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు ద్విచక్ర వాహనదారులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును పాన్ షాపు నుంచి బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.