• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వామ్మో ఈ ఉల్లికి ఏమైంది: హైదరాబాదులో కిలో ఉల్లి రేటు తెలిస్తే కన్నీళ్లే..!

|

హైదరాబాదు: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. అకాల వర్షాలతో పంటనష్టం జరగడం, ఉల్లి స్టాక్‌లో లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులు ఉల్లిని కొనాలంటేనే జంకుతున్నారు. ఇక హైదరాబాదులో కూడా ఉల్లి ధరలు కోయకుండానే ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. హైదరాబాదులో కిలో ఉల్లి ధర రూ. 150 మార్కును తాకింది. ఇప్పటి వరకు ఒక బెంగాల్‌లోనే ఈ స్థాయిలో మండుతున్న ఉల్లి ధరలు ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాదును కూడా టచ్ చేశాయి.

ఉల్లి ధరలపై దద్దరిల్లిన లోక్‌సభ: తాను ఉల్లి ఎక్కువగా తిననంటూ నిర్మలా సెటైర్

దాదాపు అన్ని వంటల్లో ఉల్లిని వినియోగిస్తారు కాబట్టి ధరలు ఎంత పెరిగినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ప్రజలు ఉల్లిని కొనుగోలు చేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉల్లి ధరలపై ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఉల్లి ధరలను అందుబాటులో ఉంచాలని మార్కెట్లకు వచ్చే వారు చెబుతున్నారు. ఉల్లి ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇప్పటి వరకు ఎప్పుడూ లేదని తొలిసారిగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయని హైదరాబాద్ ఆనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు చేగూరి వెంకట్రావ్ అన్నారు. భారీ వర్షాలతో ఉల్లి పంట నాశనమైందని అందువల్లే ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయని చెప్పారు.

Onions rates in Hyderabad touch Rs.150 per kilo

ఇక 100 కిలోల ఉల్లి ధరలు రూ. 15వేలు పలుకుతుందని చెప్పారు. అత్యల్పంగా రూ. 6వేలు పలుకుతోందని వెల్లడించారు. ప్రభత్వం వెంటనే చర్యలు తీసుకుని ఉల్లి ధరలను నియంత్రిచాల్సిన అవసరం ఉందని మరో వ్యాపారి చెప్పాడు. ఉల్లి వ్యాపారులు ఐదు బ్యాగుల ఉల్లిని ఒకప్పుడు కొనేవారని... ఇప్పుడు వారు ఒక బ్యాగు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ట్రేడర్ చెప్పాడు. ప్రజలు ఒకప్పుడు ఐదు కిలోల ఉల్లిపాయలు కొనేవారని ఇప్పుడు అర కిలో ఉల్లిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ధరలు ఇలా మండిపోతుంటే పేద ప్రజలు ఎలా కొంటారని మరో వ్యక్తి ప్రశ్నించాడు. నాణ్యత గల ఉల్లి కిలో రూ.150కి కొంటున్నారని, ధ్వంసమైన లేదా నాశనమైన ఉల్లిని కిలో రూ.60 పెట్టి కొంటున్నారని చెప్పారు.

ఇదిలా ఉంటే పెరుగుతున్న ధరల దృష్ట్యా ప్రభుత్వం అధీనంలో నడిచే ఎంఎంటీసీ 4వేల టన్నుల ఉల్లిపాయలను టర్కీ నుంచి దిగుమతి చేసుకునేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. అవి వచ్చే ఏడాది జనవరికి నగరానికి చేరుకుంటాయని భావిస్తున్నారు. మరోవైపు ఉల్లిపై దొంగల కన్ను పడింది. ఎక్కడికక్కడ ఉల్లిని చోరీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Poor and middle-class people in Hyderabad city are having a tough time managing their kitchen supplies as the onion prices have touched Rs 150 kg in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more