హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి విందులో పెళ్ళికొడుకు స్నేహితుల చికెన్ పంచాయితీ.. హైదరాబాద్ లో ఆగిపోయిన పెళ్లి!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పీటల మీద దాకా వచ్చిన ఓ పెళ్లి చిన్న కారణంతో ఆగిపోయిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో చోటుచేసుకుంది. వధూవరులు ఒకరికి ఒకరు నచ్చినా, రెండు కుటుంబాలు ఒకరితో ఒకరు సంబంధం కుదుర్చుకోవడానికి సిద్ధమైనా తెల్లవారితే పెళ్లి జరుగుతుందనగా భోజనాల దగ్గర చోటుచేసుకున్న ఓ సంఘటన పెళ్లి రద్దు చేసుకునే దాకా వెళ్ళింది. కేవలం చికెన్ కోసం మొదలైన పంచాయితీ చిలికి చిలికి గాలివానగా మారి ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. ఇంతకు ఏం జరిగిందంటే

పెళ్లి విందులో చికెన్ లేదని పెళ్ళికొడుకు స్నేహితులు తినకుండా వెళ్ళిన ఘటన

పెళ్లి విందులో చికెన్ లేదని పెళ్ళికొడుకు స్నేహితులు తినకుండా వెళ్ళిన ఘటన

హైదరాబాద్ షాపూర్ నగర్ లో సోమవారం నాడు ఓ జంట వివాహానికి ఏర్పాట్లు చేశారు. జగద్గిరిగుట్ట రింగు బస్తీకి చెందిన వరుడికి, కుత్బుల్లాపూర్ కు చెందిన వధువుకు వివాహం జరగాల్సి ఉంది. ఇక ఈ వివాహం కోసం షాపూర్ నగర్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆడ పెళ్ళి వారు బీహార్ రాష్ట్రానికి చెందిన మార్వాడి కుటుంబీకులు కావడంతో శాఖాహార వంటలు చేసారు. ఇక అందరూ వచ్చారు భోజనం చేశారు. అంతా సవ్యంగా జరుగుతుంది అని భావిస్తున్న సమయంలో విందు ముగింపు దశలో ఉన్న సమయంలో పెళ్లి కుమారుడి స్నేహితులు భోజనానికి వచ్చారు. అయితే వారు చికెన్ పెట్టలేదని గొడవపడి తినకుండా వెళ్ళిపోయారు.

 వధూవరుల కుటుంబాల మధ్య ఘర్షణ .. పెళ్లి క్యాన్సిల్

వధూవరుల కుటుంబాల మధ్య ఘర్షణ .. పెళ్లి క్యాన్సిల్

ఇక పెళ్ళికొడుకు స్నేహితులు వస్తే వారికి కావలసిన ఆహారం పెట్టలేదని, పెళ్ళికొడుకు స్నేహితులను అవమానించారని ఆ తర్వాత గొడవ మొదలైంది. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో వివాహం క్యాన్సిల్ అనేశారు. ఇక పీటలమీద దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుందని ఆవేదనతో పెళ్లికుమార్తె తరపు బంధువులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. జీడిమెట్ల సిఐ పవన్ ను కలిసి అసలు విషయాన్ని వివరించారు. ఇక ఆయన రెండు కుటుంబాల వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కేవలం పెళ్ళికొడుకు స్నేహితుల చికెన్ కోసం పెళ్లి రద్దు చేసుకోవడం మంచిది కాదని చెప్పి పంపించారు.

పోలీసుల కౌన్సిలింగ్ తో పెళ్ళికి ముహూర్తం ఖరారు

పోలీసుల కౌన్సిలింగ్ తో పెళ్ళికి ముహూర్తం ఖరారు

పోలీసుల కౌన్సిలింగ్ తో ఆగిపోయిన పెళ్లిని ఈ నెల 30వ తేదీన తిరిగి జరిపించాలని వధూవరుల కుటుంబీకులు నిర్ణయానికి వచ్చారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు వివాహ వేడుకల సమయంలో అనేకం చోటు చేసుకున్నాయి. గతంలో కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాలో ఒక పెళ్లిలో ఒక అప్పడం కారణంగా ఊహించనంత పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. వరుడి స్నేహితులు ఎక్స్ ట్రా అప్పడం అడగగా ఇవ్వకుండా ఆడ పెళ్ళి వారు వాటిని తిరస్కరించడంతో గొడవ జరిగింది. వాగ్వాదం ప్రారంభమైన తర్వాత అది క్రమంగా తీవ్రమైన కొట్లాటగా మారింది. ఇక ఈ వ్యవహారంలో పోలీసుల జోక్యం అవసరమయ్యే ముష్టియుద్ధంగా మారింది.

 గతంలో పెళ్ళికొడుకు స్నేహితులు పెళ్ళిలో ఎక్స్ ట్రా అప్పడం కోసం ముష్టి యుద్ధం

గతంలో పెళ్ళికొడుకు స్నేహితులు పెళ్ళిలో ఎక్స్ ట్రా అప్పడం కోసం ముష్టి యుద్ధం


అప్పడం కోసం ఒకరిని ఒకరు గుద్దటం, ఒకరినొకరు తన్నుకోవడం, పిడికిలి బిగించి బలంగా కొట్టడమే కాకుండా, వడ్డించే గిన్నెలు, బక్కెట్లతోనూ దాడులు చేసుకున్నారు. కుర్చీలు, బల్లలు కూడా ఒకరిపై ఒకరు విసురుకునే స్థాయికి ఫైటింగ్ జరిగింది . అలప్పుజా పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేశారు. ఇలా ఓ పక్కన పెళ్లి జరుగుతుంటే చికెన్ ముక్క కోసం, నల్లి బొక్క కోసం కొట్టుకుని చచ్చిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఏది ఏమైనా చిన్నచిన్న కారణాలకే కలకాలం కలిసి ఉండాల్సిన పెళ్లి బంధాన్ని ఈ విధంగా అబాసుపాలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు.

English summary
The chicken that broke the marriage in hyderabad shapur nagar. A fight broke out between the bride and groom's family as the groom's friends left the wedding dinner without eating only for chicken. It went on the wedding cancelation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X