• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఊళ్ళో చాటింపు: బహిరంగ ప్రదేశంలో ఆ పని చేస్తే అంతే.. చెప్పినోళ్లకు వెయ్యి.. పంచాయతీకి రెండువేలు(వీడి

|

హైదరాబాద్ : ఔను .. బహిరంగ ప్రదేశంలో ఆ పని నిషిద్దం. కాదు కూడదని చేశారో అంతే. మీ వెంట గ్రామం మొత్తం ఫోకస్ చేస్తోంది. ఇందులో మంచితోపాటు నగదు ప్రోత్సాహం ఉండటం విశేషం. ఎవరూ కాదన్న పాతర్ల పహాడ్ సర్పంచ్ నిర్ణయాన్ని విద్యాధికులు, మేధావులు ప్రశంసిస్తున్నారు. అసలే గ్రామం .. ఆపై అన్నట్టు ... గ్రామంలో ఎవరైనా .. భయం, భక్తి లేకుండా బహిరంగంగా ఆ పని చేస్తే ఇక అంతే అని డప్పు చాటింపు వేయించేశారు. దీంతో ఎవరైనా కనిపిస్తే చాలు పట్టుకొని పంచాయతీకి అప్పగిద్దామని యువత కళ్లకు వత్తులు వేసుకొని చూస్తోంది.

బ్యాన్ .. బ్యాన్ ..

బ్యాన్ .. బ్యాన్ ..

పక్కనున్న వీడియో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం పాతర్ల పహాడ్‌లోనిది. అక్కడ డప్పు చాటింపు జాగ్రత్తగా వినండి మీకే అర్థమవుతోంది విషయమేమిటో. అవును గ్రామంలో బహిరంగ బహిర్భుమి నిషేధం. దీంతో దోమలు, ఈగలు వాలి లేని లేని రోగాలు వస్తాయి. దీంతో సర్పంచ్ మంచి ఐడియా వేసి డప్పు చాటింపు వేయించారు. గ్రామంలో మరుగుదొడ్డి లేని వారు కట్టించుకోవాలని చాటింపు చేశారు. టాయిలెట్ కట్టించుకుంటే ప్రభుత్వమే నగదు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకేముందు ప్రభుత్వం ఇస్తోంది కదా అని అందరూ కట్టించుకోరు .. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీంతో సర్పంచ్‌కు మంచి ఆలోచన వచ్చి డప్పు చాటింపు వేశారు.

డప్పు చాటింపు

గ్రామంలో బహిరంగ బహిర్బుమి పోతే జరిమానా అంటూ చాటింపు వేశారు. అలా పోయేవారిని చూసి పట్టుకోవాలని గ్రామంలోని వారికి పని కల్పించారు. అలా పట్టించిన వారికి ప్రోత్సాహకం కూడా అందిస్తామని తెలిపారు. బహిరంగ బహిర్బుమి వెళ్లిన వారికి రూ.3 వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. దీంతో పంచాయతీలోకి రూ.3 వేల ఆదాయం చేరుతుంది. అందులోంచి రూ.1000 పట్టించిన వారికి అందజేస్తారు. అదే ఉత్సాహంతో మరికొందరు కూడా బహిర్బుమి వెళ్లినవారిని పట్టిస్తారని సర్పంచ్ ఆలోచన చేశారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చడం నిజంగా అద్భుతం. ఇలాంటి పనిని మిగతా గ్రామాలు కూడా చేస్తే బాగుంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

రూ.3 వేల జరిమానా

రూ.3 వేల జరిమానా

అంతేకాదు బహిర్బుమికి వెళ్లిన వారు రూ.3 వేలు కట్టి ఊరికే ఉండటం కాదు. వారికి వచ్చే ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయి. ఫైన్ కట్టాలి. దాంతో పాటు ప్రభుత్వం అందించే పిన్షన్ రద్దు చేస్తారు. దీంతో ముసలి, ముతక వారికి ఆసరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు రేషన్ కార్డు నుంచి సరుకులు ఇవ్వరు. దీంతో వండుకుందామంటే ఏమీ లేని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం అందిస్తోన్న రైతు బంధు నగదు కూడా ఇవ్వబోమని హుకుం జారీచేశారు. అంటే పంట పెట్టుబడి సాయం కూడా లేనట్టే. అటే మీరు బహిరంగ బహిర్బుమికి వెళ్లడం వల్ల రూ.3 వేల జరినామా కట్టాలి. అంతటితో ఆగకుండా పింఛన్‌ను మరచిపోవాలి, రేషన్ ఇవ్వరు. రైతు బంధుకు ఎసరు వస్తోంది. దీంతో అలా వెళ్లేవారు ఆలోచిస్తారని గ్రామంలోని యువత అంటోంది. అంతేకాదు పట్టించిన వారికి మంచి పేరొస్తోంది. దాంతోపాటు ప్రోత్సాహక నగదు కూడా అందుతుంది. దీంతో సర్పంచ్ ఆలోచన బాగుందని .. మిగతా వారు కూడా ఆచరించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.

English summary
Atmakur mandal of the Suryapet district is located in Pataral Pahad. ban on open defecation in the village. This is a good idea of ​​Sarpanch. Those who do not have toilets in the village have been asked to tie up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X