హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైద్యో నారాయణో హరి, చిన్నారికి ఉస్మానియా వైద్యుల పున:ర్జన్మ, అరుదైన ఆపరేషన్

|
Google Oneindia TeluguNews

ఔను.. వైద్యులను దేవుడితో పోలుస్తారు. కనిపించే దైవం డాక్టర్లు. నల్గొండ జిల్లాకు చెందిన చిన్నారికి ప్రాణం పోశారు వైద్యులు. కన్న తండ్రే చిన్నారిపై దాడి చేయగా.. వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించి ప్రాణం పోశారు. చిన్నారి పరిస్థితి స్థిమితంగా ఉందని.. పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతోందని వైద్యులు తెలియజేశారు.

పచ్చనికాపురంలో..

పచ్చనికాపురంలో..

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్‌తండాకు చెందిన మధు-అఖిల దంపతులు, మధు బోరు మెకానిక్‌గా పనిచేసేవారు. వీరికి పాప కూడా ఉన్నారు. 18 నెలల పసిపాపను చూస్తూ ఉండాల్సిన సంసారంలో అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్యభర్తలు నిత్యం గొడవపడుతూ ఉండేవారు.

అనుమానంతో..

అనుమానంతో..

గత నెల 29వ తేదీన కూడా గొడవపడ్డారు. క్షణికావేశానికి గురైన మధు.. తన భార్యపై పారతో దాడి చేశాడు. దీంతో అఖిల అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే పసిపాపపై కూడా దాడి చేశాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో మధు తల్లిదండ్రులు ఇంట్లో లేరు. పొలం నుంచి వచ్చేసరికి అఖిల-మధు రక్తపుమడుగుల చనిపోయి ఉన్నారు. చిన్నారి కొన ఊపిరితో కొట్టుమిట్టడుతూ ఉంది.

ఉస్మానియాకు చిన్నారి

ఉస్మానియాకు చిన్నారి

వెంటనే చిన్నారిని 108 వాహనంలో చిన్నారిని స్థానిక ఆస్పత్రికి.. అక్కడినుంచి నిలోఫర్ తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తీసుకొచ్చారు. 30వ తేదీన ఉస్మానియా న్యూరో విభాగంలో చేర్చారు. చిన్నారి దవడ ఎముక విరిగి నోరు తెరుచుకోలేని పరిస్థితి నెలకొంది. చిన్నారికి పుట్టినప్పటి నుంచే హద్రోగ సమస్య ఉంది. మత్తు ఇంజెక్షన్ ఇస్తే పాప ప్రాణాలకు ప్రమాదం అని భావించారు.

15 మంది వైద్యులు

15 మంది వైద్యులు


ఫైబర్ ఆప్టిక్ ఇంట్యూబేషన్-బ్రాంకోస్కోపీ గైడెడ్ పద్ధతి ద్వారా సర్జరీ చేశారు. ఆపరేషన్ చేసి దవడ భాగాన్ని సరిచేశారు. 15 మంది వైద్యులు 3 గంటలపాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు.

English summary
osmania doctors save 18 months child life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X