హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3 లక్షల మంది సంతకాలతో పిటిషన్..వెటర్నరీ వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్

|
Google Oneindia TeluguNews

వెటర్నరీ డాక్టర్ హత్యోదంతంపై నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఆమెకు న్యాయం చేయాలని ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముంబైకి చెందిన శాంతాను కొడపే చొరవ తీసుకొని చేంజ్ డాట్ ఓఆర్జీ అనే పోర్టల్‌లో న్యాయం చేయాలనిపేజీ క్రియేట్ చేశారు.

అనుహ్య స్పందన

అనుహ్య స్పందన

శాంతాను పిటిషన్‌ను దేశవ్యాప్తంగా అనుహ్య స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 3 లక్షల మంది సంతకం చేసి తమ మద్దతును ప్రకటించారు. దీంతో లైంగికదాడి చేసిన నిందితులకు ఉరి శిక్ష సరైనదని గట్టిగా తమ వాదన వినిపించారు. పోర్టల్‌కు మరింత మంది సపోర్ట్ చేస్తున్నారు.

వి వాంట్ ప్రొటెక్షన్

వి వాంట్ ప్రొటెక్షన్

ప్రతీ మహిళ ఉదయం, రాత్రిళ్లు శ్రమిస్తున్నారని శాంతాను రాసుకొచ్చారు. కానీ రాక్షసుల రోడ్ల మీద తిరుగుతున్నారనే విషయం మరచిపోయారని చెప్పారు. ఆ మహిళల భద్రత కోసం నడుం బిగించాలని కోరారు. నేరాలకు వ్యతిరేకంగా అడుగువేయాలని విన్నవించారు.

మరో 30 కూడా..

మరో 30 కూడా..

చేంజ్ డాట్ ఓర్జీలో శాంతాను పిటిషన్‌తోపాటు మరొ 30 మంది కూడా పేజీ క్రియేట్ చేశారని పేర్కొన్నారు. వారంతా నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయా పిటిషన్లలో వేలాదిమంది సంతకం చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

నేతలకు నో ఎంట్రీ.. కేంద్రమంత్రికి ఓకే...

నేతలకు నో ఎంట్రీ.. కేంద్రమంత్రికి ఓకే...

ఆదివారం వెటర్నరీ వైద్యురాలు పేరెంట్స్‌ను పరామర్శించేందుకు నేతలు వెళితే పరాభావం ఎదురైంది. సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిని గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. కానీ కేంద్రమంత్రి సంజీవ్ బాల్యన్ మాత్రం వెటర్నరీ వైద్యురాలి పేరెంట్స్‌ను పరామర్శించారు. ఇదివరకే గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కూడా శ్రీధర్ రెడ్డి దంపతులను ఓదార్చిన సంగతి తెలిసిందే.

English summary
veterinary doctor murder case over three lakh people have signed a petition on change.org seeking justice for her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X