"వకీల్ సాబ్" ఇన్‌కంప్లీట్: అర్థాంతరంగా ఆగిన షూటింగ్..? పవన్‌పై అసంతృప్తి,రీజన్ ఇదే..!
హైదరాబాదు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఇటు పవన్ ఫ్యాన్స్ అటు జనసేన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వారు మరికొంత కాలం వేచిచూడక తప్పదు. ఎందుకంటే వకీల్ సాబ్ షూటింగ్ మరింత జాప్యం జరగనుంది. ఇందుకు కారణం రాజకీయాలు అనే మరో పడవపై పవన్ ప్రయాణిస్తుండటమే..!

సినిమాలపై పవన్ ఫోకస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలను అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసి ప్రజా జీవితానికి అంకితమవుతానని గతంలో అంటే పార్టీ పెట్టిన కొత్తలో స్పష్టంగా చెప్పిన పవన్ కళ్యాణ్... 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంతో తిరిగి తన ప్రొఫెషన్ పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే వకీల్‌సాబ్ చిత్రానికి పవన్ సైన్ చేశారు. ఇక ఏపీ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమా షూటింగుల్లో పాల్గొన్న పవన్... ఆ తర్వాత కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో షూటింగ్ బంద్ పెట్టక తప్పలేదు. ఇక ఏపీ ప్రభుత్వం వైఫల్యాలపై ట్విటర్ ద్వారానే ఎండగట్టినప్పటికీ పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయారు.

వకీల్ సాబ్ షూటింగ్ వాయిదా..?
తాజాగా వకీల్ సాబ్‌కు సంబంధించి మరో అప్డేట్ అనధికారికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా... జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో వీలైనన్ని చోట్ల పోటీ చేసి సత్తా చాటాలని జనసేనాని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తానే స్వయంగా ప్రచారం చేయాలని తలుస్తున్న నేపథ్యంలో వకీల్ సాబ్ షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదావేయాలని కోరినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటంతో అప్పటి వరకు షూటింగ్ వాయిదా వేయాలని పవన్ కళ్యాణ్ చిత్ర బృందాన్ని కోరినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఎంపికచేసే పనిలో ఉండటంతో షూటింగ్ వాయిదా వేయాలని పవన్ సూచించినట్లు తాజా ఖబర్.

డిసప్పాయింట్ అయిన దిల్ రాజు
లాక్డౌన్ కారణంగా వకీల్ సాబ్ షూటింగ్ వాయిదా పడగా ... మరో రెండు రోజుల్లో తిరిగి చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉండగా ఈ చిత్రానికి జీహెచ్ఎంసీ ఎన్నికల రూపంలో మరో అవాంతరం ఎదురైంది. ఈ వార్త గుప్పుమనడంతో పవన్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. పవన్ అభిమానుల రియాక్షన్ ఇలా ఉంటే చిత్ర నిర్మాత దిల్‌రాజు కూడా జనసేనాని డెసిషన్‌తో కాస్త నిరాశకు గురైనట్లు సన్నిహితులు చెప్పారు. ఇది సోషల్ మీడియాలో మాత్రమే చక్కర్లు కొడుతున్న వార్త. వకీల్ సాబ్ చిత్ర యూనిట్ నుంచి షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన చిత్ర బృందానికి పవన్ నిర్ణయం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.