• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సహజీవనం రివర్స్.. ఇద్దరితో కాపురం.. చివరకు ఇరుక్కున్నాడుగా..!

|

హైదరాబాద్ : ఒక్క ఫ్యామిలీతోనే నెట్టుకురావడం గగనమైన ఈ రోజుల్లో ఓ యువకుడు ఇద్దరు యువతులతో సహజీవనం చేయడం చర్చానీయాంశంగా మారింది. చివరకు విషయం కాస్తా ఇద్దరికి తెలియడంతో సీన్ రివర్సైంది. ఒకరికి తెలియకుండా మరొకరితో హ్యాపీగా సహజీవనం చేస్తున్న సదరు యువకుడి గుట్టు రట్టు కావడంతో రివర్స్ గేర్ వేశాడు. ఇద్దరికి చెప్పా పెట్టకుండా పరారయ్యాడు. దాంతో ఆ ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇరువురి ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇద్దరితో సహజీవనం.. ఒకరికి తెలియకుండా మరొకరితో..!

ఇద్దరితో సహజీవనం.. ఒకరికి తెలియకుండా మరొకరితో..!

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన 29 ఏళ్ల ఆకుదారి కార్తీక్ అనే యువకుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. అయితే ఇదివరకు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు యూసుఫ్‌గూడ ప్రాంతంలో నివసించేవాడు. ఆ క్రమంలో అక్కడే నివాసముండే ఓ ప్రైవేట్ ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. కొన్నాళ్ల పాటు ఆమెతో సహజీవనం చేసి చివరకు పెళ్లి చేసుకున్నాడు.

అదలావుంటే ఈమెతో పెళ్లి కాకముందే మరో యువతితో దాదాపు ఎనిమిదేళ్లుగా అదే ప్రాంతంలో సహజీవనం చేస్తున్నాడు కార్తీక్. అలా ఒకరికి తెలియకుండా మరొకరితో సహజీవనం చేస్తూ వారిని బురిడీ కొట్టించాడు.

హయత్‌నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. రోజుకో కథ.. నిందితుడి స్కెచ్ చూస్తే షాక్..!

మొదటి ప్రేయసి ఫిర్యాదు.. రెండో ప్రేయసి విడిపించారు..!

మొదటి ప్రేయసి ఫిర్యాదు.. రెండో ప్రేయసి విడిపించారు..!

పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి తనతో సహజీవనం చేసి తప్పించుకు తిరుగుతున్నాడని మొదటి ప్రేయసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది కాస్తా రెండో ప్రేయసి కమ్ భార్యకు విషయం తెలిసి ఠాణాకు వెళ్లి సహజీవన ప్రియుడు కమ్ భర్తను విడిపించుకుంది. దాంతో మొదటి ప్రేయసి కార్తీక్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

రెండో ప్రేయసి కమ్ భార్యను విడిచిపెట్టి తనను పెళ్లి చేసుకోకుంటే జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు. దాంతో అప్పటినుంచి కార్తీక్.. రెండో ప్రేయసి కమ్ భార్యను దూరం పెడుతూ వచ్చాడు. దాంతో ఆమె ఎందుకు దూరంగా ఉంటున్నావంటూ గొడవకు దిగింది. ఇక అప్పటినుంచి మొహం చాటేశాడు.

 చివరకు రెండో ప్రేయసికి కూడా హ్యాండ్.. ఆమె కూడా ఫిర్యాదు

చివరకు రెండో ప్రేయసికి కూడా హ్యాండ్.. ఆమె కూడా ఫిర్యాదు

ఆ క్రమంలో జులై 31వ తేదీన కార్తీక్‌పై బంజారాహిల్స్ పోలీసులకు రెండో ప్రేయసి కమ్ భార్య ఫిర్యాదు చేశారు. కార్తీక్‌తో పాటు అతడి తండ్రి వెంకటేశం, సోదరుడు నాగరాజు, స్నేహితుడు మనోజ్‌ కూడా నిందితులంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దాంతో కార్తీక్‌తో పాటు ఆమెను కూడా భరోసా కౌన్సెలింగ్ కేంద్రానికి పంపించారు పోలీసులు.

అక్కడి నుంచి తిరిగొచ్చిన కార్తీక్.. తనకు రెండు రోజుల గడువు కావాలంటూ.. అంతలోపు తన నిర్ణయమేంటో చెబుతానంటూ ఆమెను నమ్మించాడు. అయితే రెండు రోజులైనా కార్తీక్ తిరిగి రాలేదు. ఫోన్ చేసినా అందుబాటులోకి రావడం లేదు. దాంతో ఆమె మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. చివరకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

English summary
In these days of committing a single family is so difficult, a young man has become a subject of discussion co living with two women. Eventually Seen reversed the matter with the two. The reverse gear is for a young girl who is happily coexisting with one another without knowing one another. He fled without telling the two. The two young women walked up to the police station. Two cases have been registered by the police on the complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X