హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Saaho Sajjannar: ఆనంద డోలికల్లో తెలంగాణ: సజ్జన్నార్ చిత్రపటానికి పాలాభిషేకం: బాణాసంచా కాల్చుతూ..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Disha Issue : సీపీ సజ్జనార్‌ కి పాలాభిషేకం.. సెల్యూట్ తెలంగాణా పోలిస్ || Oneindia Telugu

హైదరాబాద్: వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి మహిళలు.. పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా మహిళలు స్వయంగా, స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వస్తుండటం.. ఈ ఎన్ కౌంటర్ పట్ల వారిలో నెలకొన్న సంతోషానికి అద్దం పడుతోంది.

నిందితులపై దిగిన బుల్లెట్..

నిందితులపై దిగిన బుల్లెట్..

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశపై కిందటి నెల 27వ తేదీన మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఆ నలుగురిని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేశారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం సంఘటనా స్థలానికి నిందితులను తీసుకెళ్లగా.. వారు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

ఆనంద డోలికల్లో తెలంగాణ..

ఆనంద డోలికల్లో తెలంగాణ..

నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారనే వార్త తెలిసిన మరుక్షణం నుంచే తెలంగాణ ప్రజలు ఆనందోత్సహాల్లో మునిగిపోయారు. పోలీసులను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. వారికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చాలా చోట్ల పోలీసులపై పూలవర్షాన్ని కురిపించారు. ఈ ఎన్ కౌంటర్ కు ప్రధాన మార్గదర్శకుడిగా, పోలీసులకు దిశా, నిర్దేశం చేసినట్లుగా భావిస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ ప్రస్తుతం తెలంగాణ ప్రజల దృష్టిలో హీరోగా మారిపోయారు.

పలు చోట్ల పాలాభిషేకాలు..

పలు చోట్ల పాలాభిషేకాలు..


ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న విషయం తెలిసిన వెంటనే వందలాది మంది మహిళలు రోడ్ల మీదికి వచ్చారు. బాణాసంచాను కాల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సజ్జన్నార్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కూడలిలో ఆయన ఫొటోను పెట్టి, పాలతో అభిషేకించారు. సాహో సజ్జన్నార్, జయహో సజ్జన్నార్ అంటూ నినాాదాలు చేశారు. ఆయన చిత్రపటానికి స్వీట్లను తినిపించారు. పరస్పరం ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకొన్నారు. చిత్రపటం ఎదురుగా బాణాసంచాను కాల్చారు.

మహిళల నుంచి ప్రశంసల వెల్లువ..

మహిళల నుంచి ప్రశంసల వెల్లువ..

ఆయా సందర్భాలన్నింట్లోనూ మహిళలే పెద్ద సంఖ్యలో కనిపించారు. కాలనీలు, అపార్ట్ మెంట్ లల్లో నివసించే మహిళలు గుంపులుగా రోడ్ల మీదికి వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేయడం కనిపించింది. మహిళలను కన్నెత్తి చూడటానికి ప్రతి ఒక్కరూ భయపడేలా చేశారని ప్రశంసిస్తున్నారు. ఇంకోసారి మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడాలనే దురాలోచన కూడా రానివ్వకుండా, ఎన్ కౌంటర్ చేయడం గొప్ప విషయమని అంటున్నారు.

English summary
People of Telangana pouring the milk on Cyberabad Police Commissioner Sajjannar, who led the encounter of Veterinary Doctor Disha's culprits encounter. People raised the slogans like Saaho Sajjannar, Jaiho Sajjannar and making celebrations for this encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X