హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Petition on Hrc: రాజ్‌భవన్‌ స్కూల్‌పై బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాజ్‌భవన్.. ప్రభుత్వ పాఠశాల. రాష్ట్రంలో మంచి పేరున్న సర్కార్ బడి. ఈ పాఠశాలలో సీటు దొరకడం అంత ఈజీ కాదు. రాజ్‌భవన్ పక్కనే ఉండటం, రాష్ట్ర ప్రథమ పౌరుడి పర్యవేక్షణలో స్కూల్ నడుస్తోంది. మాజీ గవర్నర్ నరసింహన్ చొరవతో స్కూల్‌కి మంచి పేరొచ్చింది. అయితే కొందరు విద్యార్థులు సరిగా చదవకపోవడం .. వారిని స్కూల్ మార్చడం వివాదానికి కారణమైంది.

రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో సీటు రావడం అంటే మమూలు విషయం కాదు. ఇక్కడ చదువుకొన్న వారికి మంచి భవిష్యత్ కూడా ఉంటుంది. అయితే ఇటీవల రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులకు టీసీ ఇచ్చారు. ఇదే అంశం వివాదానికి కారణమైంది. వారికి అకారణంగా టీసీ ఇచ్చారని బాలల హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.

petition on Hrc: rajbhavan school gave tc to students

రాజ్‌భవన్ స్కూల్ తీరును తప్పుపట్టారు. 30 మంది విద్యార్థులకు ఆ కారణంగా టీసీ ఇచ్చారని మండిపడ్డారు. వారిని ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలకు పంపడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం చర్యను తప్పుపట్టారు. టీసీ ఇచ్చిన 30 మంది విద్యార్థులను తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.

రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో టీసీల అంశం చర్చకు దారితీసింది. దీనిపై బాలల హక్కుల సంఘం కలుగజేసుకోవడంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఆ 30 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని బాలల హక్కుల సంఘం తమ పిటిషన్‌లో హెచ్‌ఆర్సీని కోరింది. పిటిషన్ విచారించి .. ప్రభత్వానికి మానవ హక్కుల కమిషన్ ఎలాంటి ఆదేశాలు జారీచేస్తుందో చూడాలి.

English summary
rajbhavan government school gave 30 students to tc. becouse they are not reading well. they shift to erramanjil high school. today child protection unioin petition to hrc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X