మోడీపై కేసీఆర్ గుస్సా.. పెట్రో ధర పెంచలే, ఆ పాపం కేంద్రానిదే.. ఏం చేశారని పైర్
ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కరోనా గురించి సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి.. పెట్రోల్ గురించి మాట్లాడటం ఏమిటని అడిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన్పటి నుంచి రాష్ట్రంలో పెట్రోల్ ధర పెంచలేదని పేర్కొన్నారు. ఏదో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో 17 పైసలు ఉంటే 20 పైసలు.. 7 పైసలు ఉంటే 10 పైసలు పెంచామని పేర్కొన్నారు. తాము ఎన్నడూ పెంచలేదని చెప్పారు. పెట్రోల్‌పై రకరకాల సెస్సులు వేస్తూ ధరలు పెంచుతుంది కేంద్ర ప్రభుత్వమేనని కేసీఆర్ విరుచుకుపడ్డారు.

మోడీ ఏం చేశారు..
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను ప్రస్తావించారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై నిందలేస్తూ సాగుతోందని ఆరోపించారు. ఈ దేశానికి మోడీ ఏం చేశారని అడిగారు. ఏ రంగంలో అభివృద్ధి సాధించారో చెప్పాలని కోరారు. ఇస్లామిక్ దేశాల్లో హిందూ ఆలయాలు కడుతున్నారు. మన దేశంలో అశాంతి చెలరేగేలా రెచ్చగొడుతున్నారు. ఉద్వేగం, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ కత్తులు పట్టుకుని ఊరేగుతారా? ప్రసంగాల జోరు, అబద్ధాల హోరు తప్ప దేశానికి జరిగిందేమీ లేదన్నారు. దీనిని అడ్డుకోకపోతే భయంకరమైన పరిణామాలు వస్తాయి.

డ్రామాలు చేస్తున్నారు...
ప్రధాని
మోడీ
డ్రామాలు
ఆడుతున్నారని
ఫైరయ్యారు.
పెట్రోలు
ధరల
పెంపు
పాపం
కేంద్రానిదే.
పన్నులు
పెంచిన
పాపాల
భైరవులు
కేంద్రం
పెద్దలే.
పొద్దున
లేస్తే
మత
రాజకీయాలు
చేస్తున్నారు.
మనిషి
కోసం
మతమా?
మతం
కోసం
మనిషా?
మనుషుల
మధ్య
తగాదాలు
పెట్టేందుకు
మతాన్ని
వాడుతున్నారని
కేసీఆర్
విమర్శలు
గుప్పించారు.
అంతేకాదు
టీఆర్ఎస్
తిరుగులేని
రాజకీయ
శక్తిగా
ఆవతరించిందని
చెప్పారు.

విజయమే
వచ్చే
ఎన్నికల్లో
కూడా
తమ
పార్టే
గెలుస్తోందని
చెప్పారు.
తమ
పార్టీ
అలా
ప్రజల
విశ్వాసం
పొందిందని
చెప్పారు.
పార్టీకి
60
లక్షల
మంది
సైనికులు
ఉన్నారని..
చిటికెస్తే
ఫండ్
వస్తోందని
చెప్పారు.
పార్టీకి
ఇప్పటికే
900
కోట్ల
వరకు
ఫండ్
ఉందని
చెప్పారు.
ప్రజల
సంక్షేమమే
తమకు
ముఖ్యం
అని
ఆయన
చెప్పారు.
వారి
మేలుకోరి
పనులు
చేపడుతామని
చెప్పారు.