India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఒక్కరే! కుటుంబ దోపిడీ పాలన నేర్చుకోవాలా?: ఏకిపారేసిన బీజేపీ కీలక నేతలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలు, ప్రశ్నలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

కేంద్ర నిధులు తెలంగాణలో దుర్వినియోగం అంటూ పీయూష్ గోయల్

కేంద్ర నిధులు తెలంగాణలో దుర్వినియోగం అంటూ పీయూష్ గోయల్


కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎంతో పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించుకున్నారన్నారు. ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటై ఆకాంక్షలు నెరవేరుతాయని యువతరం భావించింది కానీ అలా జరగలేదు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమం సాగింది. తెలంగాణలో ఇప్పటికీ నిరుద్యోగ సమస్య పీడిస్తోంది. 8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఎన్నో నిధులు ఇచ్చింది. కేంద్ర నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బడ్జెట్‌ను భారీగా పెంచారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు.

టీఆర్ఎస్ సర్కారు భూస్థాపితమేనన్న పీయూష్ గోయల్

టీఆర్ఎస్ సర్కారు భూస్థాపితమేనన్న పీయూష్ గోయల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. దుబ్బాక నియోజకవర్గాన్ని బీజేపీ గెలిచుకుంది. హుజూరాబాద్‌లో మంచి మెజార్టీతో గెలిచాం. 2024లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపిస్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటవుతుంది. అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ భూస్థాపితమవుతుందన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.

కేసీఆర్ ఫాంహౌస్ సీఎం.. ఓవైసీ ఒక్కరే డైరెక్టుగా అంటూ కిషన్ రెడ్డి

కేసీఆర్ ఫాంహౌస్ సీఎం.. ఓవైసీ ఒక్కరే డైరెక్టుగా అంటూ కిషన్ రెడ్డి


మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై భారీగా జరిమానాలు వేశారన్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ చేతిలో ఉందని విమర్శించారు. ప్రగతిభవన్‌లోకి మంత్రులకు ఎవరికీ ప్రవేశం లేదన్నారు. ఎంఐఎం నేత మాత్రం నేరుగా సీఎం వద్దకు వెళ్తారన్నారు. సీఎం కేసీఆర్‌ నెలలో 20 రోజులు ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. ఆరేళ్లుగా సచివాలయానికి ఒక్కరోజు కూడా సీఎం రాలేదు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్‌ ఒక్కరే అని కిషన్ రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన నేర్చుకోవాలా?: కిషన్ రెడ్డి

కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన నేర్చుకోవాలా?: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో ఉన్నది తండ్రికుమారుడి నిరంకుశ సర్కార్‌ అని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మీరు చేస్తున్న అవినీతిని చూసి నేర్చుకోమంటారా? అని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత వరద బాధితులకు ఇంటికి రూ.10 వేలు ఇస్తామన్న టీఆర్ఎస్ సర్కారు.. ఇవ్వలేదన్నారు. వాస్తు పేరుతో సచివాలయం కూలగొట్టి వందల కోట్లు వృథా చేశారరని మండిపడ్డారు. 5 ఏళ్లు మంత్రిమండలిలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేని విమర్శించారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారన్నారు. ఒక్కపైసా ఇవ్వకుండా మంచి మెజార్టీతో బీజేపీ విజయం సాధించింది. తెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతుందని కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కారు 8 ఏళ్లుగా గ్రామపంచాయతీలకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో మార్పు ఖాయం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కేసీఆర్ కుటుంబ క్యాబినెట్ దోపిడీ: బండి సంజయ్ విమర్శలు

ఎందరో ప్రజల బలిదానాల వల్ల తెలంగాణ సాకారమైందన్నారు బండి సంజయ్‌. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. అయితే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగట్లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ నెరవేర్చలేదని, కేసీఆర్‌ కుటుంబమే క్యాబినెట్‌గా మారి రాష్ట్రాన్ని దోచుకుంటోందని విమర్శించారు. బీజేపీ పోరాటం చూసి కేసీఆర్‌లో భయం మొదలైందన్నారు. తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

English summary
Piyush Goyal and Kishan Reddy and Bandi Sanjay slams cm KCR and his family politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X