మరోసారి.. కేసీఆర్తో పీకే భేటీ.. బీఆర్ఎస్పై చర్చ..?
రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్.. వరసగా సీఎం కేసీఆర్తో భేటీ అవుతున్నారు. ఇటీవల ఫామ్ హౌస్లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఇవాళ ప్రగతిభవన్ వచ్చారు. వరస సమావేశాల నేపథ్యంలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వేలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై పీకే సర్వే చేశారు. టీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

విసృత చర్చ
కేసీఆర్, పీకేతో పాటు మంత్రి హరీష్రావు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలో భారత రాష్ట్ర సమితి మారబోతోందా? ఈ నెల 19లోగా జరుగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో దీనిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం ప్రకటించనున్నారా? అనంతరం జాతీయ రాజకీయాలపై కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టనున్నారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రగతి భవన్లో శుక్రవారం అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, నేతలతో కేసీఆర్ ఆరు గంటల పాటు చర్చించిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పోషించే పాత్రపై విస్తృతంగా చర్చించారు.

పెరిగిన అశాంతి
ప్రస్తుతం
దేశంలో
పాలన
ఒక
లక్ష్యం
లేకుండా
ఉంది.
దీంతో
అశాంతి
పెరిగిపోయింది.
ఈ
పరిస్థితుల్లో
దేశ
ప్రజల
అవసరాలే
ఎజెండాగా
జాతీయ
రాజకీయాల్లో
కీలక
పాత్ర
పోషిద్దాం
అని
కేసీఆర్
ప్రతిపాదన
చేశారని
తెలుస్తోంది.
ప్రతికూల
పరిస్థితులను
అనుకూలంగా
మార్చే
నైపుణ్యం
ఉన్న
ప్రశాంత్
కిషోర్
మార్గదర్శనంలో
కేసీఆర్,
జాతీయ
పార్టీ
అంశాన్ని
ముందుకు
తెచ్చినట్లు
ప్రచారం
జరుగుతోంది.
నియోజకవర్గాల
వారీగా
పార్టీ
పరిస్థితిపై
సర్వే
నిర్వహించిన
ప్రశాంత్
కిశోర్
ఇటీవల
ఫాంహౌస్లో
కేసీఆర్తో
భేటీ
అయ్యారు.

3 నెలల్లో సంచలన అంశం..
ప్రశాంత్ కిశోర్ వ్యూహంతో ముందుకుసాగుతున్న కేసీఆర్.. మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానని ఇటీవల ప్రకటించారు. టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తున్నట్లుగా మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధుల సమావేశంలో సంకేతం ఇవ్వడంతో.. కేసీఆర్ చెప్పిన సంచలన ప్రకటన ఇదేనా? అన్న చర్చ నడుస్తోంది. కానీ ఇదీ నిజమని తెలియాలంటే మరికొద్దీ రోజులు ఆగాల్సిందే. ప్రశాంత్ కిశోర్.. వ్యుహాలు.. మోడీ, జగన్కు చక్కగా పనిచేశాయి. అధికారం కూడా చేపట్టారు. కానీ రాహుల్ రాత మాత్రం మారాలేదు. మరీ కేసీఆర్ జాతీయ స్థాయిలో సక్సెస్ అవుతారో లేదో చూడాలీ.