హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా బాధితులకు అదే సంజీవని: సజ్జనార్‌కు చిరంజీవి అభినందనలు, సీపీ ధన్యవాదాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా బాధితుల పాలిట ప్మాస్మా ఓ సంజీవని అని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసిన వారిని సీపీ సజ్జనార్ శుక్రవారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వారివి వెలకట్టలేని సేవలు..

వారివి వెలకట్టలేని సేవలు..


ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కరోనా వేళ ఫ్రంట్‌లైన్ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వెలకట్టలేని సేవలందిస్తున్నారని ప్రశంసించారు. కరోనా బారినపడి ఎంతో మంది బాధితులుగా మారుతున్నారని, మందు కూడా లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు.

కరోనా బాధితుల పాలిట ప్మాస్మానే సంజీవని.. సీపీకి అభినందనలు

కరోనా బాధితుల పాలిట ప్మాస్మానే సంజీవని.. సీపీకి అభినందనలు

ప్లాస్మా అనేది కరోనా బాధితుల పాలిట సంజీవని నిలుస్తోందని చిరంజీవి వ్యాఖ్యానించారు. కరోనా బాధితులకు ప్లాస్మా దానం చేస్తే 99 శాతం బతికే అవకాశముంటుందన్నారు. ప్మాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా నుంచి కోలుకుంటారని తెలిపారు. ఒకరి ప్లాస్మా నుంచి 30 మందికి సాయం చేయవచ్చని తెలిపారు. సీపీ సజ్జనార్ మంచి కార్యక్రమం చేపట్టారని అభినందించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో లాక్‌డౌన్ సమయంలో చాలా మందికి సాయం చేశారని కొనియాడారు.

ప్లాస్మా దానంతో నష్టమేమీ ఉండదు..

ప్లాస్మా దానంతో నష్టమేమీ ఉండదు..

గతంలో తాను కూడా బ్లడ్ బ్యాంకును ఇలానే ప్రారంభించినట్లు చిరంజీవి తెలిపారు. తమ బంధువు వైరస్ సోకి అపోలోలో చికిత్స పొందుతూ ఉంటే స్వామి నాయుడు అనే వ్యక్తి ప్లాస్మా ఇవ్వడం ద్వారా నయమైందని చిరంజీవి తెలిపారు. ప్మాస్మా దానం వల్ల రక్తం నష్టం జరగదని, ప్లాస్మా తగ్గినా 24 గంటల నుంచి 48 గంటల్లోనే తిరిగి తయారవుతుందని చిరంజీవి వివరించారు. కరోనా నుంచి కోలుకున్నవారు ఎలాంటి భయం లేకుండా ప్లాస్మాను దానం చేయొచ్చని అన్నారు.

Recommended Video

RGV Targeting Mega Family Again & Again | 'అల్లు' సినిమా ప్రకటన || Oneindia Telugu
చిరంజీవికి సీపీ సజ్జనార్ ధన్యవాదాలు

చిరంజీవికి సీపీ సజ్జనార్ ధన్యవాదాలు


ప్లాస్మా దానం చేసిన వారికి మళ్లీ కరోనా సోకినా లేదా వారి కుటుంబసభ్యులకు కరోనా వచ్చినా వారికి ప్లాస్మా చికిత్సలో ప్రాధాన్యత ఇస్తామని సజ్జనార్ తెలిపారని చెప్పారు. తన అభిమానులు ఇలాంటి మంచి పనులవైపు మళ్లితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను వందశాతం ఎదుర్కోవచ్చని చిరంజీవి తెలిపారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. తల సేమియా రోగుల కోసం సైబరాబాద్ పోలీసులు మొదలుపెట్టిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి చిరంజీవి ఎంతో సహాయపడ్డారని తెలిపారు. కరోనాను జయించిన వారు ధైర్యంగా ప్మాస్లాను దానం చేయవచ్చని తెలిపారు. ప్మాస్మా దానం చేయడం ద్వారా కరోనా బాధితులకు ప్రాణదానం చేసినవారవుతారని అన్నారు. అయితే, ప్లాస్మాతో

English summary
plasma is Sanjeevani to corona patients: Chiranjeevi and CP Sajjanar Honored Plasma Donors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X