హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1,2,3.. మరో 37 రోజులే.. రైళ్లలో ఇక అవి నిషేధం..!! గాంధీ జయంతి డెడ్‌లైన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మరో 37 రోజుల్లో గాంధీ జయంతి. ప్రతీ ఏటా వచ్చే వేడుకే.. కానీ ఈ ఏడాదికో ప్రాధాన్యం ఉంది. అదే గాంధీ 150 జయంతి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించి యాక్షన్ ఫ్లాన్ కూడా రూపొందించారు. అందులో ఒకటి స్వచ్చ్ భారత్.

స్వచ్ఛ భారత్ అంటే దేశం శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడం. దీంతోపాటు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి నిషేధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2 నుంచి రైళ్లలో ప్లాస్టిక్ వినియోగం నిషేధమని రైల్వేశాఖ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జోన్ల అధికారులకు ఆదేశాలు కూడా జారీచేశారు. పర్యావరణంపై ప్లాస్టిక్ ప్రతికూల ప్రభావం చూపిస్తుండటంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేయాలని డిషిషన్ తీసుకున్నారు.

plastic bottles are ban on railways

తొలి దశలో రైళ్లలో పడి ఉన్న వాటర్ బాటిళ్లను ఐఆర్సీటీసీ సేకరిస్తోంది. 360 రైల్వేస్టేషన్లుచ 1853 ప్లాస్టిక్ వాటర్ బాటిల్ డిస్జోజల్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు వెండర్స్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా ఉండేలా ప్రోత్సహించాలని జోనల్ రైల్వేస్ జనరల్ మేనేజర్లకు లేఖ కూడా రాశారు. మరోవైపు రైల్వే ఉద్యోగులు కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని స్పష్టంచేశారు. రైల్వేశాఖ సూచనలతో ఆయా విభాగాలు సంసిద్దమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని తేల్చిచెప్పాయి.

English summary
IRCTC is collecting water bottles lying in trains in the first phase. 360 Railway Stations 1853 Plastic water bottle disposal machines are installed. In addition, Zonal wrote to Railways General Managers to encourage vendors to avoid using plastic carry bags. Railway employees, on the other hand, have also advocated a reduction in the use of plastic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X