• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జర్నలిస్ట్ రఘు అరెస్ట్‌పై విచారణ జరపండి, హెచ్ఆర్సీని కోరిన జర్నలిస్ట్ నేతలు

|

జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై పోలీసులపై విచారణ జరిపించాలని కోరుతూ జర్నలిస్ట్ నేతలు మానవహక్కు కమిషన్‌ను కోరారు. టీ జ‌ర్న‌లిస్టుల ఫోరం, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల జ‌ర్న‌లిస్టులు మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యను కలిసి ఈ మేరకు విజ్ఞ‌ప్తి చేశారు. మానవహక్కుల కమిషన్ సెక్ర‌ట‌రీ విద్యాధ‌ర్ భ‌ట్ చ‌క్ర‌హ‌రికి TJF అధ్యక్షుడు పల్లె రవి కుమార్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, TWJF అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శ బసవ పున్నయ్య లేఖ అందజేశారు.

అరెస్ట్ అక్రమమే..

అరెస్ట్ అక్రమమే..

మల్కాజ్ గిరికి చెందిన తొలి వెలుగు యూ ట్యూబ్ చానల్ జర్నలిస్ట్ గంజి రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వారు ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, రఘు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ప్రజల పక్షాన నిలిచి అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తే జర్నలిస్ట్ రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రఘు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అమానుషంగా ఉందన్నారు.

మఫ్టీలో వచ్చి మరీ..

మఫ్టీలో వచ్చి మరీ..


ఈ నెల 3వ తేదీన మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్ళిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. రఘును ఎవరు తీసుకు వెళ్లారో.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకపోవడంతో జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడు భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి జర్నలిస్టుగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే రఘు చేసిన నేరమనుకుంటే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సి ఉండేది. రఘుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అసలు వచ్చిన వారు పోలీసులా లేక ప్రైవేట్ గుండాలా అనేది తెలియకుండా మఫ్టీలో వచ్చి బజారులో అందరూ చూస్తుండగా బలవంతంగా ఎత్తుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ.

వెలికి తీయడమే నేరమా..?

వెలికి తీయడమే నేరమా..?

గుర్రంపోడు భూముల విషయంలో రఘుపై మోపిన కేసులు అక్రమమైనవి. జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లడం సరికాదన్నారు. అన్యాయంగా అక్రమంగా రఘును అరెస్ట్ చేసి మానవ హక్కులకు విఘాతం కల్పించారని ఫైరయ్యారు. రఘు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో జర్నలిస్టులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని.. రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని.. లేఖలో పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో టీ-జ‌ర్న‌లిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు స‌తీష్ క‌మ‌ల్, తెలంగాణ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టు ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు మామిడి సోమ‌య్య‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ బ‌స‌వ పున్న‌య్య‌, పిల్లి రాంచంద‌ర్, టీ-జ‌ర్న‌లిస్టుల ఫోరం నాయ‌కులు పాల‌కూరి రాజు, కోడికంటి శ్రీ‌నివాస్, స్వామి ముద్దం, పోగుల ప్ర‌కాశ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

English summary
pls inquire about journalist raghu arrest journalist leaders request to hrc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X