India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని ఖుషీ - వెల్డన్ సంజయ్ : ఒక్క సారిగా పార్టీలో హైప్ - త్వరలో ప్రమోషన్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గాలు ముగిసాయి. తెలంగాణ పార్టీ నేతలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఆ సభకు హాజరైన ప్రధాని మోదీ వేదిక పైకి వస్తూనే...హాజరైన జనం.. మోదీ మోదీ అంటూ చేస్తున్న నినాదాలతో ఖుషీ అయ్యారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఇలాకాలో సభకు వచ్చిన స్పందనతో ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన మోములో సంతోషం స్పష్టంగా కనిపించింది. వేదిక పైనా హాజరైన వారికి వంగి అభివాదం చేసారు. వారికి ధన్యవాదాలు చెప్పారు. సభా వేదిక మీద ఆశీనులయిన తరువాత.. పక్కనే ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను జనం బాగా వచ్చారంటూ భుజం పైన తట్టి అభినందించారు.

అందరి సమక్షంలోనే భుజం తట్టి


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీలో జోష్ పెరిగింది. గ్రేటర్ ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నికల్లో విజయంతో సంజయ్ పైన పార్టీ అధినాయకత్వానికి నమ్మకం పెరిగింది. టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీని నిలిపే విధంగా సంజయ్ గుర్తింపు సాధించారు. ఇక, బీజేపీ వ్యూహాత్మకంగానే ఈ సారి పార్టీ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఇందు కోసం చేసిన ఏర్పాట్ల పైన ప్రధానితో పాటుగా అమిత్ షా సైతం బండి సంజయ్ ను అభినందించారు. ప్రధాని బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సభ నిర్వహణ క్రెడిట్ బండి సంజయ్ ఖాతాలో పడింది. ప్రధాని..జేపీ నడ్డా..అమిత్ షా తో పాటుగా కేంద్ర మంత్రులు..ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రత్యేకంగా బండి సంజయ్ ను అభినందించారు.

షా - పార్టీ నేతలు సైతం ప్రశంసలు

షా - పార్టీ నేతలు సైతం ప్రశంసలు

సమావేశాల్లో రాజకీయ తీర్మానం పైన చర్చ జరిగిన సమయంలోనూ.. బహిరంగ సభ తరువాత జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలోనూ సంజయ్ కు ముఖ్య నేతలు కీలక బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ ను ధీటు ఎదుర్కోవాలని..పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. బహిరంగ సభా వేదిక పైన బండి సంజయ్ తన ప్రసంగంలో ప్రధానిని ఆకట్టుకోవటానికే ప్రయత్నం చేసారు. పదే పదే మోదీ పేరు ప్రస్తావిస్తూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ప్రధానిని ప్రశంసిస్తూ తన ప్రసంగం కొనసాగించారు. మోదీ తన దేవుడంటూ కీర్తించారు. ఈ స్థాయిలో..ఈ సమయంలో తెలంగాణలో బీజేపీకి జోష్ పెరిగిందనే విధంగా రెండు రోజుల పాటు సమావేశాల పైన ఆసక్తి - బహిరంగ సభ జరిగాయి.

బండి సంజయ్ నిలబెట్టుకుంటారా

బండి సంజయ్ నిలబెట్టుకుంటారా

దీంతో...ఎన్నికల వరకు తెలంగాణ బాధ్యలు పూర్తిగా బండి సంజయ్ కే రాష్ట్రంలో కొనసాగించటం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో సంజయ్ కు మంత్రి పదవికి అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కానీ, మంత్రి పదవి ఇవ్వటం ద్వారా తెలంగాణ బాధ్యతల పైన పూర్తిగా ఫోకస్ పెట్టలేరనేది మరో అభిప్రాయం. దీంతో..పార్టీలోనే పూర్తిగా సహకరిస్తూ..తెలంగాణ వరకు స్వేఛ్చను ఇవ్వనున్నారు, ఈ పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ నేతలు ఇక పూర్తిగా బండి సంజయ్ మార్గదర్శకంలోనే నడవాలనే విషయం స్పష్టం అవుతోంది. మరి..సంజయ్ తనకు దక్కుతున్న గుర్తింపును ఏ మేర నిలబెట్టుకుంటారో.. భవిష్యత్ లో ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

English summary
PM Modi and BJP key leaders appreciated telangana paryt Chief Bandi sanjay on success of public meeting and Arrangements for party executive meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X