• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మోడీ అబద్ధాల కోరు.. కేసీఆర్ గొప్పోడు.. బాబు గెలవడు.. జగన్‌తోనే హోదా : ఓవైసీ

|

హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ. అబద్ధాలకు మోడీ రారాజు అంటూ ఎద్దేవా చేశారు. ఆయన ధనవంతుల చౌకీదారంటూ విరుచుకుపడ్డారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన అసదుద్దీన్ పలు అంశాలు ప్రస్తావించారు. దేశ ప్రధాని హోదాలో ఉన్న మోడీ అబద్ధాలు మాట్లాడటం సరికాదన్న ఓవైసీ.. బీజేపీకి ఓట్లెయ్యొద్దన్నారు.

మోడీని చీప్ ప్రధాని అంటారా?.. నువ్వొక జోకర్.. కేసీఆర్‌పై రాజాసింగ్ సెటైర్లు

మోడీవి అన్నీ అబద్ధాలే : ఓవైసీ

మోడీవి అన్నీ అబద్ధాలే : ఓవైసీ

బీజేపీతోనే మహిళా సంరక్షణ అనేది పెద్ద అబద్ధమన్నారు అసదుద్దీన్. జేఎన్‌యూలో మహిళలపై బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ ప్రతినిధులు దాడులు చేసి రెండేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మోడీ గద్దెనెక్కాక మాబ్ లించింగ్స్ అధికంగా పెరిగాయని ఫైరయ్యారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని గత ఎన్నికల సమయంలో ప్రకటించి.. ఐదేళ్లు పదవిలో ఉన్నా కూడా ఎందుకు తొలగించలేదని మండిపడ్డారు.

ముస్లిం రిజర్వేషన్ల అంశంలోనూ మోడీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని అమలుచేస్తున్న మోడీ.. ముస్లిం రిజర్వేషన్లపై కక్షగట్టారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు ఉందంటూ కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటోందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో కమలనాథులకు పరాభావం తప్పదని.. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం కొలువుదీరనుందని జోస్యం చెప్పారు. అప్పుడు ముస్లింల 12 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు.

దేశం, రాజ్యాంగాన్ని మించిన గొప్పోడా..? : ఓవైసీ

దేశం, రాజ్యాంగాన్ని మించిన గొప్పోడా..? : ఓవైసీ

2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన్నారు ఓవైసీ. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16 సీట్లు, ఎంఐఎం ఒక్క సీటు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామన్నారు.

దేశం, రాజ్యాంగాన్ని మించి మోడీ గొప్పవాడేమీ కాదన్నారు. అంతిమంగా చూసినట్లయితే దేశంలో రాజ్యాంగమే అత్యుత్తమమైందని అభిప్రాయపడ్డారు. దేశ ప్రధానిగా ఉన్న మోడీ.. అబద్ధాలు మాట్లాడటం సరికాదన్నారు. అబద్ధాలకు ఆయన రారాజు అంటూ ఆరోపించారు. మోడీ ధనవంతులకు చౌకీదారని.. వ్యాపారస్థులకు, బ్యాంకు లోన్ల ఎగవేతదార్లకు కాపలాదారుడని వ్యాఖ్యానించారు. అచ్చేదిన్‌ అచ్చేదిన్ అంటూ మోడీ పలికిన మంచి రోజులు ఏవంటూ ప్రశ్నించారు. 5 కోట్ల మందికి ఉద్యోగాలన్నారు.. ఏవి, వచ్చాయా? అని నిలదీశారు.

చంద్రబాబు గెలవడు.. జగన్‌తోనే హోదా

చంద్రబాబు గెలవడు.. జగన్‌తోనే హోదా

పనిలోపనిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏకిపారేశారు ఓవైసీ. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమన్నారు. వైసీపీ విజయం సాధిస్తుందని.. 130 ఎమ్మెల్యే స్థానాలు, 21 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. బాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జగన్‌తోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని తేల్చి చెప్పారు. మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు.. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పదన్నారు.

దేశంలో ప్రధాన పార్టీలని విర్రవీగుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఇంకా చాలా పార్టీలు ఉన్నాయన్నారు. ప్రాంతీయ పార్టీల్లో సైతం గొప్ప నాయకులు ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా గొప్ప నాయకుడని అభివర్ణించారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వంలో కేసీఆర్ దే కీలకపాత్రన్న ఓవైసీ.. తామెవరికి బీ టీమ్, సీ టీమ్ కాదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad sitting mp and mim president Asaduddin Owaisi expressed his views in meet the press programme. He told that PM Modi and lies go hand in hand. His name should not be Chowkidar, but king of lairs. Also he told that AP CM Chandra babu naidu fails in upcoming elections and YS Jaganmohan reddy will take care about AP Special Status.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more