• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు

|

తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్‌ను.. తల్లితెలంగాణకు జన్మనిచ్చిన తనయుడిగా పోల్చుతూ ''తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు''అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మొదలు దేశ ప్రముఖులంతా ఆయనకు విషెస్ తెలిపారు. కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం బర్త్ డే సంద్భంగా 'ఈచ్ వన్ ప్లాంట్ వన్' కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కలు నాటారు.

  #HappyBirthdayKCR: Gajwel People Gift To CM KCR | Oneindia Telugu

  ఆయన కొడుకునైనందుకు..

  ప్రతి సందర్భాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకునే మంత్రి కేటీఆర్.. తన తండ్రి, సీఎం కేసీఆర్ బర్త్ డే నాడు ప్రత్యక విషెష్ చెప్పారు. ‘‘నాకు తెలినవాళ్లందరిలోకి ధైర్యవంతుడు, బహుముఖ ప్రజ్ఞశాలి, ప్రజాకర్షణ, దయాహృదయమున్న క్రియాశీలక వ్యక్తి ఆయనే. తనను నాన్నా అని పిలవడానికి నేనెంతో గర్వపడతాను. మీరు దీర్ఘకాలం జీవించాలని.. మీ నిబద్ధత, ముందుచూపుతో మా అందరిలో స్ఫూర్తి నింపాలని మనసారా కోరుతున్నాను. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు'' అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

  సీఎంకు ప్రధాని విషెస్

  సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాక్షలు చెప్పారు. సోమవారం ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండేలా దేవుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతరత్రా నిధుల విడుదలు, విభజన సమస్యల పరిష్కారం విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం నడుస్తుండటం, ఆదివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను విమర్శించడం తదితర పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి పుట్టినరోజుకు ముందే సీఎం ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా, ఈ వారానికి వాయిదాపడింది.

  ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష: మంత్రి హరీశ్

  తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ మంత్రి హరీశ్ రావు.. సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మీ స్వప్నం.. ఈ రాష్ట్రం మీ త్యాగఫలం.. ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శనం.. ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష.. తెలంగాణ జాతిపిత కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను''అని హరీశ్ ట్వీట్ చేశారు.

  హ్యాపీ బర్త్ డే పెదనాన్న: ఎంపీ సంతోశ్

  హ్యాపీ బర్త్ డే పెదనాన్న: ఎంపీ సంతోశ్

  ‘‘నాతోపాటు యావత్ తెలంగాణ జీవితాంతం ఆరాధించే గొప్ప వ్యక్తిత్వానికి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే పెదనాన్నా. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం''అని ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్.. సీఎం కేసీఆర్ కు విషెష్ తెలిపారు. కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత కూడా ‘‘హ్యాపీ బర్త్ డే డ్యాడీ.. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలి''అంటూ ట్వీట్ చేశారు.

  లక్షలాది మొక్కలు.. పలు చోట్ల రక్తదానాలు..

  లక్షలాది మొక్కలు.. పలు చోట్ల రక్తదానాలు..

  సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణతోపాటు దేశవిదేశాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు పలు కార్యక్రమాలు చేపట్టారు. గిఫ్టులు, బొకేల బదులు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలంటూ ముందునుంచే ప్రచారం చేయడంతో సోమవారం చాలా చోట్ల, చాలా మంది మొక్కలు నాటారు. కొన్ని చోట్ల మంత్రుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు. దాదాపు ప్రతి గల్లీలో కేసీఆర్ బర్త్ డే కేకులుకోని టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలుచేసుకున్నారు. ఏపీలోని విజయవాడలోనూ గులాబీ అభిమానులు కార్యక్రమాలు చేపట్టారు.

  English summary
  prime minister narendra modi greets birthday wishes to telangana cm kcr on monday. minister ktr and several others plants saplings
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more