హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐపీసీ, సీఆర్పీసీ మార్పులపై మోదీ ఫోకస్ - వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

దేశంలో అర్బనైజేషన్ పెరుగుతుననదని, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరాలు, పట్టణాలకు వలస వస్తున్నారని, ఈ క్రమంలోనే నగరాల్లో నేరాలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు మంచి పోలీసు వ్యవస్థను తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

రెండో భార్యగా స్వీకరించాడు: బీజేపీ మహిళా కార్యకర్త సంచలనం - రాసలీలల్లో ఇంకొందరు నేతలంటూరెండో భార్యగా స్వీకరించాడు: బీజేపీ మహిళా కార్యకర్త సంచలనం - రాసలీలల్లో ఇంకొందరు నేతలంటూ

ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు..

ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు..

బ్రిటీష్ జమానా నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ) చట్టాల్లోని కొన్ని లోపాల వల్ల నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడటం లేదని, బాధితులకు సత్వర, సమర్థవంతమైన న్యాయం అందేలా ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో మార్పులు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని, ప్రస్తుతం కొనసాగుతోన్న చట్టాల్లోని క్షమాభిక్ష సెక్షన్ల సవరణకు నిఫుణుల ఆధ్వర్యంలో కసరత్తు కొనసాగుతోందని, నిఫుణుల సలహాల తర్వాత డ్రాఫ్టు సిద్దం చేసి, ప్రజాభిప్రాయానికి వెళతామని ఆయన తెలిపారు.

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం ప్లాన్ - వచ్చే జులై నాటికి 50 కోట్ల డోసులు - ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం ప్లాన్ - వచ్చే జులై నాటికి 50 కోట్ల డోసులు - ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

తెలుగు రాష్ట్రాల పోలీసులు భేష్..

తెలుగు రాష్ట్రాల పోలీసులు భేష్..


హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ తో పాటు అంబర్ పేట్ నియోజకవర్గంలో 2.45కోట్ల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ.. తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల పనితీరు బాగుందని, టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంటూ నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు రాష్ట్ర పోలీసులు ముందున్నారన్నారని కేంద్ర మంత్రి కితాబిచ్చారు.

Recommended Video

5 Young Indian Cricketers And Their Girlfriends! || Oneindia Telugu
త్వరలోనే ఉద్యోగాల భర్తీ..

త్వరలోనే ఉద్యోగాల భర్తీ..

సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలైన హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, లక్నో, ముంబైలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై కేంద్రం దృష్టి పెట్టిందని, స్మార్ట్ పోలీస్ విధానం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే తొలి ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా భారత్ అడుగులు వేస్తున్నదని, ఫోరెన్సిక్ ల్యాబుల్లో 41 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. పారా మిలటరీ విభాగాల్లో ఉద్యోగాలకు సంబందించి త్వరలో జాతీయ రక్షణ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేస్తామన్నారు.

English summary
Minister of State for Home Affairs G. Kishan Reddy has said that Prime Minister Narendra Modi has focused on amending several sections of the IPC and CRPC laws. He said the exercise on changes in the IPC and CRPC was currently underway under the auspices of experts and a draft would be prepared after expert advice and go to a referendum. Kishan Reddy, who is on a visit to Hyderabad, told the media on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X