హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్ముంటే పాతబస్తీకి రావాలంటూ ప్రధానికి ఓవైసీ సవాల్: 28న హైదరాబాద్‌కు నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 28న హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని మోడీ పరిశీలిస్తారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పరిశీలిస్తారు.

Recommended Video

PM Modi to Visit Hyderabad దమ్ముంటే పాతబస్తీకి రావాలంటూ ప్రధాని మోడీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్..!!
28న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ..

28న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ..

భారత్ బయోటెక్‍‌లో వ్యాక్సిన్ కోవాగ్జిన్ పురోగతిని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ప్రధాని మోడీ పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ అభివృద్ధి వివరాలను, తాజా పరిస్థితిపై మోడీ సమీక్షించనున్నారు.

గ్రేటర్ ఎన్నికల వేళ నగరానికి ప్రధాని మోడీ..

గ్రేటర్ ఎన్నికల వేళ నగరానికి ప్రధాని మోడీ..

కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం పీక్ దశలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీపై జేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, ఎంఐఎం కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన జరగడం హాట్ టాపిక్‌గా మారింది.

గ్రేటర్ ఎన్నిగ్రేటర్ ప్రచారానికి బీజేపీ బడా నేతలు..

గ్రేటర్ ఎన్నిగ్రేటర్ ప్రచారానికి బీజేపీ బడా నేతలు..

గ్రేటర్ బీజేపీ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 27న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన నవంబర్ 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనుండగా,డిసెంబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ల వేళ నగరానికి ప్రధాని మోడీ..

ప్రధాని మోడీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్..

ప్రధాని మోడీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్..

ఇది ఇలావుంటే, ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలంటూ ప్రధాని మోడీకి ఓవైసీ సవాల్ చేశారు. ప్రధాని మోడీ ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తే ఎన్ని సీట్లు గెల్చుకుంటారో చూద్దామని అన్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ బడా నేతలు ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో వారంతా ఎందుకు ఏకంగా ప్రధాని మోడీతోనే ప్రచారం చేయించండి అంటూ బీజేపీకి ఓవైసీ సూచించారు.

English summary
PM Modi to Visit Bharat Biotech Hyderabad on Nov 28: Asaduddin dares Modi to campaign in GHMC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X