బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్.. తాజా పరిణామాలపై డిస్కషన్
టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్షతో రాష్ట్రంలో పరిణామాలు హీటెక్కాయి. హైకోర్టు రిమాండ్ రద్దు చేయడంతో విడుదలయిన సంగతి తెలిసిందే. బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ ఆయన బండి సంజయ్‌తో మాట్లాడారు.
బండి సంజయ్‌కి ఫోన్ చేసిన మోడీ దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను కూడా అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష గురించి, అరెస్ట్ తదితర అంశాల గురించి చర్చించారు.తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే.

జాగరణ దీక్ష కోవిడ్ రూల్స్ బ్రేక్ చేశారని కేసు పెట్టారు. కరీంనగర్ సెషన్స్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు కూడా వెళ్లారు. సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించగా.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరడంతో న్యాయస్థానం అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బెయిల్ కూడా మంజూరు చేసింది.అంతకుముందు బండి సంజయ్ కుమార్‌పై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. డిజాస్టర్ మేనెజ్మెంట్ యాక్ట్ సహా 3 సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి.
బండి సంజయ్‌తోపాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచ రవి, మర్రి సతీశ్‌లకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో హైకోర్టును ఆక్రయించగా.. ఊరట లభించింది. బండి సంజయ్‌ను తక్షణమే రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రధాని మోడీ.. సంజయ్‌తో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై కేంద్ర నాయకత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగానే అగ్రనేతల రాక.. దీక్షలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బండి సంజయ్ అరెస్ట్, రిమాండ్‌తో రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాయి. జేపీ నడ్డా హైదరాబాద్ రాక.. మోడీ సంజయ్‌తో మంతనాలు చేయడం.. పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్ చేసినట్టు అనిపిస్తోంది.